అలౌకిక ఆనందానికి, వ్యక్తిత్వ వికాసానికి కృష్ణుడు ప్రతిరూపమని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశప్రజలందరికీ కృష్ణాష్టమి సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ప్రబోధకుడిగా, రాజనీతిజ్ఞుడిగా కృష్ణుడి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు శ్రీకృష్ణతత్వం ప్రతీక అన్నారు. కృష్ణతత్వంతో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. 

Continues below advertisement






 


Also Read: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం


కృష్ణుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలి 


ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సీఎం జగన్ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియచేశారు. ప్రపంచానికి గీతను బోధించి ప్రేమతత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన ట్వీట్ చేశారు. కుటుంబసభ్యులతో కలిసి సిమ్లాలో సీఎం జగన్ వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. 


 






Also Read: Krishna Janmashtami 2021: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే


వ్యక్తిత్వ వికాస పాఠం


రాష్ట్ర ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణుడి అవతారం ఆద్యంతం వ్యక్తిత్వ వికాస పాఠం వంటిదని పేర్కొన్నారు. మనిషిలోని బలహీనతల్ని తొలగించి కార్యసాధనలో విజేతలను చేసే గీతోపదేశాన్ని ప్రపంచానికి అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు అని చంద్రబాబు  ట్వీట్ చేశారు. 


 






Also Read: Krishna Jayanti 2021: కృష్ణం వందే జగద్గురుం.. ఆలయాలకు తరలివచ్చిన భక్త జనం