6G Network : 6జీ వేగం 6జీ కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, 6జీ నెట్‌వర్క్ పరికరం బ్యాటరీ బ్యాకప్‌ను కూడా పెంచుతుందని అంటున్నారు. 2030 నాటికి భారతదేశంలో 6జీ నెట్‌వర్క్ ప్రారంభమవుతుందనే ప్రచారం నడుస్తోంది. అదే గనక నిజం ఐతే నెట్ స్పీడ్ 100 రెట్లు వేగవంతం అవుతుంది. ఈ విషయంపై IIT-BHUలో భారత్ 6జీ డైరెక్టర్ జనరల్ రాజేష్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, 6జీ కోసం గ్రామాలు లేదా నగరాల్లో పెద్ద టవర్లు ఏర్పాటు చేయడం లేదు. ఇందుకోసం నగరం నుంచి గ్రామం వరకు విద్యుత్ స్తంభాలపై దీని షెల్స్‌ను అమర్చనున్నారు. ఈ షెల్స్ పూర్తిగా సెన్సార్ బేస్ మీద పని చేస్తాయి. దీని బరువు దాదాపు 8 కిలోలు ఉంటుంది. 2030 నాటికి భారతదేశంలో 6జీ లాంచ్ అవుతుందని రాజేష్ కుమార్ పాఠక్ ఈ సందర్భంగా చెప్పారు. 6జీని లాంచ్ చేస్తే ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంటుందని తెలిపారు.


IT నిపుణులు 6జీ గురించి నిరంతరం ఆలోచనలు చేస్తున్నారు. అంతే కాదు, ఇది ఆరోగ్యానికి కూడా హాని కలిగించవు. 6జీ నెట్‌వర్క్‌లో కూడా శాటిలైట్ నెట్‌వర్క్‌ను ఉపయోగించనున్నట్లు డైరెక్టర్ జనరల్ రాజేష్ కుమార్ పాఠక్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలుగుతారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ 6జీ నెట్‌వర్క్‌లో మరింత బ్యాకప్‌ను  అందిస్తుంది. ఎందుకంటే ఈ నెట్‌వర్క్ పూర్తిగా సెన్సార్ బేస్ అవుతుంది. మీరు యాప్‌లో ఉన్నప్పుడే అది యాక్టివ్‌గా ఉంటుంది. లేకపోతే అది స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది.


5జీ ఫోన్లు పనిచేయవా..?


6జీ ప్రవేశపెట్టిన తర్వాత 5జీ ఫోన్లు పనిచేయవని చాలా మంది భావిస్తున్నారు. కానీ అందిన సమాచారం ప్రకారం, 6జీ వచ్చిన తర్వాత కూడా, 5జీ ఫోన్లు పని చేస్తాయి. అందుకు అనుగుణంగా అవి అప్డేట్ అవుతాయి.


6జీ నెట్‌వర్క్‌ అంటే..


5జీ నెట్‌వర్క్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షనే ఈ 6జీ నెట్‌వర్క్‌. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు సైతం 5జీ సేవలు విస్తరించనున్నట్లు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇక 6జీ నెట్‌వర్క్‌ 5జీ కంటే వెయ్యి రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం విభాగం (DoT) విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్‌ ప్రకారం.. 5జీ నెట్‌వర్క్‌ సెకనుకు 10 గిగాబైట్స్‌ వేగంతో పనిచేస్తే.. 6జీ సెకనుకు ఒక టెరాబైట్‌ వేగంతో పని చేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగా 5జీ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్‌ నుంచి 66 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6జీ టెక్నాలజీలో మాత్రం స్పెక్ట్రమ్‌ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్‌ల వరకు ఉపయోగించవచ్చు.


ప్రస్తుతం సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, స్మార్ట్‌ సిటీలు, రిమోట్ హెల్త్‌కేర్‌ వంటి సేవల్లో 5జీ నెట్‌వర్క్‌ కీలకంగా మారింది. 6జీ ద్వారా ఈ సేవలు మరింత ఆధునిక సాంకేతికతతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని  భావిస్తున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే 6జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తే హెచ్‌డీ క్వాలిటీ కలిగిన 100 సినిమాలను ఒక నిమిషంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కారులో గానీ, విమానంలో గానీ ప్రయాణిస్తూ.. ఫోన్‌ ద్వారా వేర్వేరు సాంకేతికతలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది.


Also Read : Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!