Smart TVs Under 20K: వింటర్ సీజన్‌లో ఇంట్లో కూర్చొని టీవీ చూడటంలో విభిన్నమైన వినోదం ఉంటుంది. టీవీని మొబైల్ కొంతవరకు భర్తీ చేసి ఉండవచ్చు, కానీ క్రికెట్, సినిమాలు మొదలైనవాటిని చూడటంలో ఉండే నిజమైన వినోదం టీవీలో మాత్రమే ఉంటుంది. టీవీ కొంచెం పెద్దదిగా ఉంటే ఈ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు ఇలాంటి అనుభవాన్ని పొందాలనుకుంటే కొత్త సంవత్సరంలో సరసమైన ధరలలో పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీని ఇంటికి తీసుకురావచ్చు. రూ.20,000 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ టీవీలు ఏవో ఒకసారి చూద్దాం.


ఏసర్ ఐ ప్రో సిరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ (Acer I Pro Series Full HD Smart LED Google TV)
ఈ 40 అంగుళాల స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్‌డీ (1920 x 1080) రిజల్యూషన్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు హెచ్‌డీఎంఐ పోర్ట్‌లు, ఒక యూఎస్‌బీ పోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియోతో అందుబాటులోకి రానుంది. దీని సౌండ్ అవుట్‌పుట్ 30 వాట్స్‌గా ఉంది. ఇది అమెజాన్‌లో ఒక సంవత్సరం వారంటీతో రూ.16,999కి లభిస్తుంది. కొన్ని సెలెక్టెడ్ క్రెడిట్ కార్డ్‌లతో దీనిపై రూ. 2,000 తగ్గింపును కూడా పొందవచ్చు.



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


ఒనిడా ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ 43ఏసీఎఫ్ (Onida Full HD Smart TV 43ACF)
ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ 1920 x 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇది రెండు హెచ్‌డీఎంఐ, ఒక యూఎస్‌బీ పోర్ట్‌ను కలిగి ఉంది. ఇది సరౌండ్ సౌండ్‌తో 20 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. దీనికి ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది. 17,999 ధరకు అమెజాన్ నుంచి ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2000 వరకు తగ్గింపును పొందవచ్చు.


హైసెన్స్ ఈ43ఎన్ సిరీస్ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ గూగుల్ ఎల్ఈడీ టీవీ (Hisense E43N Series Full HD Smart Google LED TV)
ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్‌డీ (1920 X 1080) రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇది డాల్బీ ఆడియోతో 30 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. అనేక సౌండ్ మోడ్‌లను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్‌బీ, ఒక హెచ్‌డీఎంఐ పోర్ట్‌లను కూడా కలిగి ఉంది. ఇది ఒక సంవత్సరం వారంటీని పొందుతోంది. అమెజాన్‌లో 43 శాతం తగ్గింపుతో రూ.19,999కి విక్రయిస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ, అనేక బ్యాంక్ ఆఫర్‌లు దీనిపై అందుబాటులో ఉండనున్నాయి. నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?