గణేష్ చతుర్థి సందర్భంగా రిలయన్స్ జియో భారతదేశంలోని ఎనిమిది నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి మీ ఇళ్లలో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభమవుతుంది. చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే, మీ ఇంటికి ఎంత ఎంబీపీఎస్ ప్లాన్‌ సరిపోతుంది? అది ఎయిర్ ఫైబర్ ప్లాన్ అయినా లేదా సాధారణ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్ అయినా.


ఈ రెండింటి విషయంలోనూ ప్రజల మనస్సులో కాస్త గందరగోళం ఉంది. కొన్ని సార్లు మనం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మన వినియోగాన్ని బట్టి కావాల్సిన ప్లాన్ ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.


ప్రస్తుతం ఇంట్లో మనందరికీ మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మొదలైన వాటికి ఇంటర్నెట్ అవసరం. మీరు కూడా ఈ గాడ్జెట్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ ప్లాన్ కొనాలని ఆలోచిస్తుంటే 10 ఎంబీపీఎస్ నుంచి 30 ఎంబీపీఎస్ ఫైబర్ ప్లాన్, 30 ఎంబీపీఎస్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ మీకు ఉత్తమమైనది.


30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో ఒక కంప్యూటర్, నాలుగు నుంచి ఐదు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మొదలైనవాటిని సులభంగా ఉపయోగించగలవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మీరు మంచి డౌన్‌లోడ్ స్పీడ్, అప్‌లోడ్ స్పీడ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనం ఏమిటంటే ఇది మీ జేబుపై ఎక్కువ భారం పడదు. అలాగే బడ్జెట్ కూడా స్థిరంగా ఉంటుంది. మీరు రూ. 500 కంటే తక్కువ ధరకు 30 ఎంబీపీఎస్ ప్లాన్‌ని పొందుతారు.


సర్వీస్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంది. వ్యక్తిగత పని కారణంగా మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలంటే మీ సౌలభ్యం ప్రకారం 30 లేదా 50 Mbps లేదా 100 Mbps ప్లాన్‌ని తీసుకోవచ్చు. సాధారణ కుటుంబానికి 10 నుంచి 30 ఎంబీపీఎస్ ప్లాన్ సరిపోతుంది. మీ గాడ్జెట్స్ అన్నీ ఇందులో సులభంగా పని చేస్తాయి. 


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial