Vodafone Idea 5G Roll Out: వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త. కంపెనీ ఢిల్లీ, పుణేలోని కొన్ని ప్రాంతాల్లో తన 5జీ సేవలను ప్రారంభించింది. ఈ సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చారు. అయితే వొడాఫోన్ ఐడియా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వెబ్‌సైట్ ప్రకారం వినియోగదారులు 5జీ రెడీ సిమ్ సహాయంతో హై స్పీడ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్‌లో వొడాఫోన్ ఐడియా ప్రమోటర్ కుమార్ మంగళం బిర్లా గత సంవత్సరం 5జీ లాంచ్, రాబోయే త్రైమాసికంలో కోర్ నెట్‌వర్క్‌పై చాలా కృషి చేసిందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 5జీని రోల్అవుట్ చేస్తుంది.


ఎయిర్‌టెల్, జియోతో పోలిస్తే కంపెనీ 5జీ సేవను సకాలంలో ప్రారంభించలేదు. ఈ కారణంగా వొడాఫోన్ ఐడియా యూజర్ బేస్ నిరంతరం తగ్గుతూనే ఉంది. ట్రాయ్ డేటా ప్రకారం 2023 జూలైలో వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల సంఖ్య 22.8 కోట్లుగా ఉంది.


సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ARPU (Average Revenue Per User) రూ. 142 కాగా, పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న Airtel ARPU రూ. 203గా ఉంది. ARPU అంటే ఒక వినియోగదారుడి ద్వారా కంపెనీకి వచ్చే సగటు ఆదాయం. వొడాఫోన్ ఐడియా వినియోగదారులను నిలుపుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీని కోసం కంపెనీ అనేక ప్లాన్‌లు, ఆఫర్‌లను కూడా ప్రారంభించింది.


ఇటీవల ముగిసిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో వొడాఫోన్ ఐడియా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 5జీ, క్లౌడ్, వీఐ సీ-డాట్ ఐవోటీ ల్యాబ్, స్మార్ట్ కనెక్టివిటీ టెస్ట్ బెడ్, వీఐ ఎయిర్‌ఫైబర్, వీఐ గేమ్స్, క్లౌడ్ ప్లే, వీఆర్ గేమ్స్, ఎక్స్ఆర్ ఎడ్యుటెక్ వంటి అనేక టెక్నాలజీలను ప్రదర్శించింది. వీఐ ప్రదర్శించిన ఈ టెక్నాలజీలు ఎక్కువగా 5జీ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటాయి.


మరోవైపు వొడాఫోన్ ఐడియా మనదేశంలో ఇటీవలే రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటిలో మొదటి ప్లాన్ రూ.198 కాగా, రెండోది రూ.204 ప్లాన్. ఈ రెండు ప్లాన్లతోనూ 500 ఎంబీ డేటాను కంపెనీ అందించనుంది. ఈ రెండు కొత్త ప్లాన్లతో అన్‌లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ ఎస్ఎంఎస్ ఏమీ లభించవు. వొడాఫోన్ ఐడియా రూ.198 ప్లాన్‌తో రూ.198 టాక్ టైమ్ పూర్తిగా లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. లోకల్, నేషనల్ కాల్స్‌కు సెకనుకు 2.5 పైసల కాల్ ఛార్జీలు విధించనున్నారు. ఎటువంటి ఉచిత ఎస్ఎంఎస్ లాభాలు కూడా రాబోవడం లేదు. ఎస్‌ఎంఎస్‌లకు మాత్రం స్టాండర్డ్ ఛార్జీలు వసూలు చేస్తారు.


ఇక రూ.204 ప్లాన్ ద్వారా రూ.204 టాక్‌టైం, 500 ఎంబీ డేటా అందించనున్నారు. మిగతా లాభాలన్నీ పై ప్లాన్ మాదిరిగానే ఉండనున్నాయి. ఈ ప్లాన్ ద్వారా వొడాఫోన్ అన్‌లిమిటెడ్ నైట్ డేటా యాక్సెస్ కూడా అందించనుంది. వొడాఫోన్ బింజ్ నైట్ బెనిఫిట్ ద్వారా రాత్రి 12 గంటల నుంచి పొద్దున్న ఆరు గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా యాక్సెస్ అందిస్తుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?