Discounts on Volvo Cars: దీపావళి సందర్భంగా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం శుభపరిణామంగా చాలామంది భావిస్తారు. అందువల్ల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అనేక కార్ల తయారీ కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తాయి.


ఈ దీపావళికి తమ కార్లపై భారీ తగ్గింపులను అందజేస్తున్న కంపెనీల్లో వోల్వో కూడా ఉంది. దీని కార్లపై రూ.ఏడు లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నారు. 'ఫెస్టివ్ డిలైట్' ఆఫర్‌లో భాగంగా వోల్వో... ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఈవీ, ఎక్స్‌సీ60 ఎస్‌యూవీలపై భారీ తగ్గింపులను అందిస్తుంది. వీటిపై అనేక ప్రయోజనాలు అందిస్తున్నారు.


ఎక్స్‌సీ60పై తగ్గింపు
ఎక్స్‌సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎక్స్ షోరూమ్ ధర ఇంతకు ముందు రూ. 56.90 లక్షలుగా ఉంది. ఇది ఇప్పుడు రూ. 55.12 లక్షలకు తగ్గింది. అంటే కంపెనీ తన ఎక్స్‌సీ40 రీఛార్జ్‌పై రూ.1,78,500 తగ్గింపును ఇస్తుందన్న మాట.


అదే సమయంలో ఎక్స్‌సీ60 లగ్జరీ SUV ఎక్స్ షోరూమ్ ధరను కంపెనీ రూ.67.85 లక్షల నుంచి ఏకంగా రూ.60.90 లక్షలకు తగ్గించింది. అంటే ఈ కారుకు రూ.6.95 లక్షల భారీ తగ్గింపు లభించిందన్న మాట.


అయితే ఈ ఫెస్టివ్ డిలైట్ ఆఫర్‌లు స్టాక్ ఉన్నంత వరకు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ రెండు ఎస్‌యూవీలు కాకుండా వోల్వో ఇండియా ప్రస్తుతం దాని ఇతర కార్లపై ఎలాంటి తగ్గింపులను అందించడం లేదు.


మరోవైపు దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఇటీవల భారతదేశంలో కొత్త, అప్‌డేటెడ్ టాటా సఫారీ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 16.29 లక్షల నుంచి రూ. 27.34 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే. దీనికి సంబంధించిన బుకింగ్ కూడా ఇప్పటికే ఓపెన్ అయింది. కొనుగోలు చేయాలనుకునే ఏ కస్టమర్ అయినా సమీపంలోని డీలర్‌షిప్‌లో కొనుగోలు చేయవచ్చు లేకపోతే ఆన్‌లైన్‌లో బుక్ చేయవచ్చు. ఈ కారు కోసం రూ. 25,000 బుకింగ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. టాటా ఇప్పటికే బుక్ చేసిన సఫారీ ఫేస్‌లిఫ్ట్ డెలివరీని కూడా ప్రారంభించింది. కొత్తగా లాంచ్ అయిన టాటా సఫారీ... స్మార్ట్ (ఓ), ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్+, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్, అకాప్లిష్డ్ డార్క్, అకాంప్లిష్డ్+ డార్క్, అడ్వెంచర్+ ఎ, అకాంప్లిష్డ్+ అనే 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది.


కొత్త టాటా సఫారీలో 2.0 లీటర్ మల్టీ జెట్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజిన్ 170 హెచ్‌పీ శక్తిని, 350 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్ బాక్స్ గురించి చెప్పాలంటే 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త టాటా సఫారీ పెద్దలు, పిల్లల కోసం 5-స్టార్ స్కోర్‌ను అందుకుంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!