Walk-in Counselling For Admission in PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(Professor Jayashankar Telangana State Agricultural University), 2023-24 విద్యా సంవత్సరానికి నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ వ్యవసాయ కళాశాల9(Rudrur Agricultural College) 0లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ స్ట్రీమ్ కింద బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)(B.Tech (Food Technology) కోర్సుల్లో ప్రవేశాలకు నవంబరు 15న వాక్-ఇన్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు టీఎస్‌ఎంసెట్-2023 ర్యాంక్ సాధించినవారు ప్రవేశాలకు అర్హులు. ఈ కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 46 సీట్లను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు అన్ని అవసరమైన ధ్రువపత్రాలతో నవంబరు 15న ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే వాక్-ఇన్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూపులు చదివినవారు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.
కోర్సు వివరాలు..
* బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ): 46 సీట్లు
సీట్ల కేటాయింపు: మొత్తం సీట్లలో ఓసీ - 46%, ఈడబ్ల్యూఎస్ - 10%, బీసీ-ఏ:7%, బీసీ-బి: 10%, బీసీ-సి:1%, బీసీడీ:7%, బీసీ-ఈ: 4%, ఎస్సీ:15%, ఎస్టీ:10% కేటాయించారు.
అర్హత: ఇంటర్మీడియట్ (ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ స్ట్రీమ్) ఉత్తీర్ణతతో పాటు టీఎస్ ఎంసెట్-2023 ర్యాంక్ సాధించి ఉండాలి. గ్రూప్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
వాక్ ఇన్ కౌన్సెలింగ్ తేది: 15.11.2023.
వేదిక:
Water Technology Centre Auditorium,
Rajendranagar, P.J.T.S.A.U.
కౌన్సెలింగ్‌కు వచ్చేవారు తీసుకురావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్లు..
➥ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన మార్కుల మెమో.
➥ఇంటర్ మార్కుల మెమో.
➥ ఎంసెట్-2023 హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు.
➥ 6 నుంచి 12వ తరగతి వరకు బోనఫైడ్/స్టడీ సర్టిఫికేట్
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ).
➥ రెసిడెన్షియల్ సర్టిఫికేట్
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2023-24)
➥ నాన్-మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్
➥ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్
ALSO READ:
తెలంగాణ 'హార్టిసెట్-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు పరిశీలన తర్వాత, ప్రవేశపరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది.
హార్టిసెట్ వివరాల కోసం క్లిక్ చేయండి..
హార్టికల్చరల్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు..
హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (హార్టికల్చర్)తో పాటు ఐకార్ ఏఐసీఈ- జేఆర్‌ఎఫ్/ ఎస్‌ఆర్‌ఎఫ్ (పీహెచ్‌డీ)-2023 స్కోరు సాధించి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 20లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆలస్యరుసుముతో నవంబరు 22 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం కల్పించారు.
కోర్సులవివరాల కోసం క్లిక్ చేయండి..