Vivo X100: వివో బెస్ట్ ఫోన్ వచ్చేది నవంబర్ 13నే - ధర, ఫీచర్లు లీక్ - ఈసారి ఎంత పెట్టారు?

Vivo X100 Series: వివో ఎక్స్100 సిరీస్ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Continues below advertisement

Vivo X100 Series: వివో ఎక్స్100 సిరీస్ చైనాలో నవంబర్ 13వ తేదీన లాంచ్ కానుంది. వివో లాంచ్ చేసే ఫోన్లలో ఎక్స్ సిరీస్ ఫోన్లే బెస్ట్‌గా ఉంటాయి. ఈ సిరీస్ గురించి ఎంతో కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వివో ఎక్స్90 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా వివో ఎక్స్100 సిరీస్ రానుంది. ముందు సిరీస్‌లో లాగే ఈ సిరీస్‌లో కూడా మూడు ఫోన్లు ఉండనున్నాయి. వీటిలో వివో ఎక్స్100 (Vivo X100) బేస్ వేరియంట్ కాగా, దీంతోపాటు వివో ఎక్స్100 ప్రో (Vivo X100 Pro), వివో ఎక్స్100 ప్రో ప్లస్ (Vivo X100 Pro+) కూడా ఉండనున్నాయి. దీనికి సంబంధించిన కీలక వివరాలు గతంలో లీకయ్యాయి. ఇప్పుడు వివో ఎక్స్100 మోడల్ స్పెసిఫికేషన్లు, ధర కూడా లీకయ్యాయి.

Continues below advertisement

వివో ఎక్స్100 ధర ఇలా... (Vivo X100 Price)
91మొబైల్స్ కథనం ప్రకారం... వివో ఎక్స్100లో నాలుగు వేరియంట్లు ఉండనున్నాయి. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లలో వివో ఎక్స్100 మార్కెట్లోకి రానుంది. దీని ధర చైనాలో 3,999 యువాన్ల (సుమారు రూ.45,600) నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. బ్లాక్, బ్లూ, ఆరెంజ్, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చని సమాచారం.

వివో ఎక్స్100 స్పెసిఫికేషన్లు (అంచనా) (Vivo X100 Specifications, Features)
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం... వివో ఎక్స్100లో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2,800 x 1,260 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఎల్పీడీడీఆర్5టీ అడ్వాన్స్‌డ్ వెర్షన్ ర్యామ్,  యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ చూడవచ్చని తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ షూటర్ కూడా ఉండనుందని సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారని తెలుస్తోంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. బ్లూటూత్ వీ5.4, ఐఆర్ సెన్సార్, వైఫై 7, ఎన్ఎఫ్‌సీ ఫీచర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత శాటిలైట్ నావిగేషన్ సిస్టం నావిక్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉండనుందని సమాచారం.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

Continues below advertisement
Sponsored Links by Taboola