Vivo V50: Vivo శుక్రవారం తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V50 భారతదేశంలో లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన Vivo V40 సిరీస్ అప్‌గ్రేడ్ వెర్షన్ అని కంపెనీ ప్రకటించింది. ఇది ప్రత్యేకంగా ZEISS ట్యూన్ చేసిన కెమెరాతో తీసుకొస్తున్న తొలి మొబైల్‌ ఫోన్.  ఇది ఫోటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత పెంచుతుంది.  


వివో V50 కలర్ ఆప్షన్స్, డిజైన్ ఎలా ఉందంటే?
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. రోజ్ రెడ్, స్టార్రి నైట్ బ్లూ, టైటానియం గ్రే కలర్‌లో అందుబాటులో ఉంటుంది. వివో V50 ప్రో వేరియంట్ ప్రస్తుతానికి లాంచ్ చేయడం లేదని సమాచారం.  


6000mAh బ్యాటరీతో వచ్చే ఈ V50 స్మార్ట్‌ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్ అవుతుందని వివో పేర్కొంది. ఈ ఫోన్ క్వాడ్-కర్వ్డ్ పంచ్-హోల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 6.78-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా దీని ప్రత్యేకత.  




Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ప్రభుత్వం హెచ్చరిక.. ఇప్పుడేం చేయాలంటే ?


వివో V50  కెమెరా ఎలా ఉంటుంది?
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం మూడు 50MP కెమెరాలు ఇచ్చారు. ఇది 50MP ప్రధాన ZEISS కెమెరా (OIS మద్దతుతో), 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. ఇది సెల్ఫీ, వీడియో కాలింగ్ అనుభవాన్ని మరింత ఆకర్షనీయం చేయనుంది. వివో V50లో ఆరా లైట్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. ఇది తక్కువ కాంతిలో కూడా మంచి ఫొటోలు తీసేందుకు సహకరిస్తుందని సంస్థ పేర్కొంది.  



ఇతర లక్షణాలు, సాఫ్ట్‌వేర్
వివో V50 కి IP68, IP69 రేటింగ్‌లు లభించాయి. ఈ ఫోన్ వాటర్‌ ఫ్రూఫ్‌, డస్ట్‌ ఫ్రూఫ్‌ కూడా. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా FuntouchOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది.


భారతదేశంలో  ఎప్పుడు లాంచ్ కానుంది. 
Vivo V50 ఫిబ్రవరి 17, 2025న భారతదేశంలో అధికారికంగా లాంచ్ కానుంది. అయితే, ఈ ఫోన్ ధరలకు సంబంధించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


Also Read: వన్​ప్లస్​ 13కు కొనసాగింపుగా మినీ.. ఎప్పుడు విడుదల కానుందంటే?