OnePlus 13 mini: వన్​ప్లస్​ 13కు కొనసాగింపుగా మినీ.. ఎప్పుడు విడుదల కానుందంటే?

OnePlus 13 mini: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్​ త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్​ను వన్​ప్లస్​ 13 మినీగా అందుబాటులోకి తీసుకురానుంది.

Continues below advertisement

OnePlus 13 mini: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) త్వరలో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్​ను వన్​ప్లస్​ 13 మినీగా అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిఇప్పటికే ఉన్న వన్​ప్లస్​ 13 సిరీస్‌కు కొనసాగింపుగా మార్కెట్​లో ప్రవేశపెట్టనుంది. వన్​ప్లస్​ మొట్టమొదటిసారిగా ‘మినీ’ మోనికర్‌తో ఈ ఫోన్‌ను ప్రారంభించనుండడం విశేషం. ఈ ఏడాది మార్చిలో ఈ ఫోన్​ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అయితే ఈ ఫోన్‌ను చైనీస్ మార్కెట్ వెలుపల విడుదల చేస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియడంలేదు.

Continues below advertisement

ట్రిపుల్​ కాదు.. డ్యూయల్​ కెమెరానే..
వన్​ప్లస్​ మినీ ఫోన్ ట్రిపుల్–కెమెరా సెటప్‌తో విడుదల కానుందని గతంలో లీక్ వెల్లడించింది. అయితే తాజా నివేదికల ప్రకారం ట్రిపుల్​ కెమెరా కాకుండా డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. వన్​ప్లస్​ 13 మినీలో 50MP ప్రైమరీ సెన్సార్ మరియు 2X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. ఈ సదుపాయంతో ఫోన్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో రాకపోవచ్చు. కెమెరాలను బార్ ఆకారపు మాడ్యూల్‌లో నిలువుగా అమర్చనున్నారు.

Also Read: ఈ యాప్ ఉంటే చాలు సైబర్ కాల్స్ రావు- కొట్టేసిన ఫోన్ బ్లాక్ అవుతుంది

ఫ్లాగ్‌షిప్ వన్​ప్లస్​ 13లో ఉపయోగించిన అదే ప్రాసెసర్..
ఫ్లాగ్‌షిప్ వన్​ప్లస్​ 13లో ఉపయోగించిన అదే ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఫోన్ పవర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది అల్ట్రాసోనిక్‌కు బదులుగా 6.3 అంగుళాల డిస్‌ప్లే, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉండవచ్చు. గ్లాస్ బ్యాక్, మెటల్ ఫ్రేమ్‌తో తయారయ్యే ఈ ఫోన్​ ప్రీమియం లుక్​ను అందించనుంది. ఈ ఫోన్​కు సంబంధించిన ధరలు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ప్రభుత్వం హెచ్చరిక.. ఇప్పుడేం చేయాలంటే ?

Continues below advertisement