Android : ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ప్రభుత్వం హెచ్చరిక.. ఇప్పుడేం చేయాలంటే ?

Govt High Risk Warning : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆండ్రాయిడ్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.

Continues below advertisement

Govt High Risk Warning : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆండ్రాయిడ్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఈ ప్రమాదాన్ని గుర్తించి, ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13, Aఆండ్రాయిడ్ 14, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులు అత్యంత ప్రమాదంలో ఉన్నారని తెలిపింది.

Continues below advertisement

ఆండ్రాయిడ్ వినియోగదారులపై హై సెక్యూరిటీ సైబర్ అటాక్ ప్రమాదం 
ప్రభుత్వ హెచ్చరిక ప్రకారం, ఆండ్రాయిడ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న లోపాలు, అలాగే చిప్‌సెట్ కంపోనెంట్స్‌లో ఉన్న సాంకేతిక సమస్యలు సైబర్ దాడులకు దారి తీసే ప్రమాదం ఉంది. ఈ మల్టిపుల్ వల్నరబిలిటీలు (సురక్షా లోపాలు) హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారం దోచుకునేందుకు అనధికారంగా అధిక హక్కులు పొందేందుకు, మీ డివైస్‌పై కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా మీ ఫోన్‌ను పని చేయకుండా (Denial of Service – DoS) అడ్డుకునే అవకాశాన్ని కల్పిస్తాయని CERT-In హెచ్చరించింది.

Also Read : Ratan Tata's Will: రతన్ టాటా వీలునామాలో "రహస్య వ్యక్తి" - రూ.వందల కోట్ల ఆస్తి అతనికే!

 ప్రభావిత డివైజ్ లు
ఈ సమస్య ప్రధానంగా ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్14, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు ఫోన్ డేటాను దొంగిలించడం, అనధికార యాక్సెస్ పొందడం, ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌ను అమలు చేయడం, లేదా ఫోన్‌ను పూర్తిగా నిష్క్రియం చేయడం వంటి పరిణామాలు ఎదురవుతాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సైబర్ దాడులను నివారించడానికి కీలక సూచనలు
సైబర్ ముప్పుల నుండి ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డివైజ్ లను సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి:
* తాజా అప్డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయండి: మీ Android ఫోన్‌ను అప్డేట్ చేయడం ద్వారా కొత్తగా కనుగొనబడిన భద్రతా లోపాలను తొలగించవచ్చు.
* ఆటోమేటిక్ అప్డేట్స్ ఎనేబుల్ చేయండి: మీరు లేటెస్ట్ సెక్యూరిటీ ఫిక్స్‌లను పొందడానికి ఆటోమేటిక్ అప్డేట్స్ ఆప్షన్‌ను ఓపెన్ చేయాలి.
* అధికారిక ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లు డౌన్‌లోడ్ చేయండి: అనధికారిక వెబ్‌సైట్ల నుంచి లేదా తెలియని మూడవ పార్టీ స్టోర్ల నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేయవద్దు.
* అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, ఈ మెయిళ్లపై క్లిక్ చేయవద్దు: అవి ఫిషింగ్ దాడులకు కారణం కావచ్చు.
* పాస్‌వర్డ్ భద్రతను పెంచండి: మీ గూగుల్ అకౌంట్, బ్యాంకింగ్, ఇతర ముఖ్యమైన అకౌంట్‌లకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్స్ ఉపయోగించండి.

Also Read : Hidden Charges: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బ్లింకిట్‌ వంటి హోమ్‌ డెలివెరీ ఫ్లాట్‌ఫామ్స్‌లో "హిడెన్‌ ఛార్జీలు" - ఇదో ఘరానా మోసం

*  2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) అనేబుల్ చేయండి: ఇది మీ అకౌంట్‌లను మరింత సురక్షితంగా ఉంచుతుంది.
* యాప్ అనుమతులను పునఃసమీక్షించండి: ఫోన్‌లోని యాప్‌లు ఏ సమాచారం యాక్సెస్ చేస్తున్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
* ఫోన్‌లో మంచి యాంటీ-వైరస్ లేదా సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఉపయోగించండి: ఇది ప్రమాదకరమైన మాల్వేర్‌లను, హ్యాకింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది.
* అనవసరమైన బ్లూటూత్, WiFi కనెక్షన్లను ఆఫ్ చేయండి: పబ్లిక్ WiFi నెట్‌వర్క్‌లు లేదా తెలియని బ్లూటూత్ డివైసులతో కనెక్ట్ కాకుండా జాగ్రత్తపడండి.

CERT-In సూచించినట్లుగా Android 12, Android 13, Android 14,  Android 15 వినియోగదారులు తక్షణమే తమ ఫోన్‌లను తాజా అప్డేట్స్ ద్వారా అప్‌డేట్ చేసుకోవాలి. ఇది హ్యాకింగ్ దాడుల ముప్పును తగ్గించగలదు.

Continues below advertisement