Sanchar Saathi App : సైబర్‌ (Cyber)దాడులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో  వినియోగదారులకు సురక్షితమైన సేవలు అందించే ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచార్‌సాథీయాప్‌ తీసుకొచ్చింది. ఇప్పటికీ ఈ పోర్టల్‌ద్వారా సేవలు అందిస్తుండగా..ఇప్పుడు యాప్‌(Mobile App) అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల ఫోన్‌లకు వచ్చే అనుమానితుల, మోసపూరితస సంభాషణలు, వాణిజ్య  సంస్థల నుంచి వచ్చే అనవసరపు  కాల్స్‌ను ఈ యాప్‌ ద్వారా ముందుగానే పసిగట్టవచ్చు. అలాగే మనకు తెలియకుండా మన పేరిట ఎవరైన సిమ్‌ తీసుకుని వాడుతున్నట్లయితే ఈ విషయాన్ని యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


 


 

మొబైల్‌ ఫోన్ పోయినా...ఎవరైనా కొట్టేసినా యాప్‌ ద్వారా ఆ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చు. ఎంతో ఆదరణ పొందుతున్న ఈ పోర్టల్‌ను  రోజుకు 3లక్షల మంది వినియోగిస్తున్నారు. అలాగే సైబర్‌ నేరాలకు,ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న  25 లక్షల హ్యాండ్‌సెట్లను బ్లాక్‌ చేశారు.12.38 లక్షల వాట్సప్ ఖాతాలు తొలగించడమేగాక, అనుమానిత మొబైల్ నెంబర్లతో అనుసంధానమైన 11 లక్షల బ్యాంకు ఖాతాదారులపై చర్యలు చేపట్టారు. చోరీకి గురైన 25 లక్షల ఫోన్లను బ్లాక్ చేయగా.. 15 లక్షల ఫోన్లను గుర్తించారు. సంచార్ సాథీ పోర్టల్ విజయవంతం కావడంతో ఇప్పుడు మొబైల్ యాప్‌ తీసుకొచ్చారు.



 

సిగ్నల్ సమస్యలకు చెల్లు చీటీ

నగరాలు,పట్టణాల్లో  5జీ స్పీడ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని పల్లెలు,మారుమూల గ్రామాల్లో కనీసం సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ (Phone Signals)అందడం లేదు. మాటలు వినిపించకపోవడం, ఇంటర్‌నెట్‌(Internet) రాకపోవడం నిత్యకృత్యమే. ఎన్ని సర్వీస్ ప్రొవైడర్లను మార్చినా...అందరిదీ అదే తంతు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు టెలికం సంస్థలు ముందుకొచ్చాయి. టెలికం రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో(JIO)తోపాటు ఎయిర్‌టెల్‌(Airtel)తో ప్రభుత్వ రంగం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL)ఈమేరకు ఒప్పందం చేసుకుంది.

 


ఈ మూడు కంపెనీలకు చెందిన ఏ వినియోగదారుడైనా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లగానే  అక్కడ సిగ్నల్ బాగా ఉన్న ఇతర నెట్‌వర్క్‌తో రోమింగ్ సౌకర్యం ఏర్పడుతుంది. దీంతో ఇక నెట్‌వర్క్‌(Network) సమస్యే ఉండదు. పైగా టెలికం కంపెనీలు సైతం అన్ని ప్రాంతాల్లో తమ టవర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఒప్పందం అటు వినియోగదారులకు, ఇటు టెలికం సంస్థలకు ఎంతో లాభదాయకంగా  ఉండనుంది.

 

గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్ వాడేవారు తమ నెట్‌వర్క్ సిగ్నల్స్‌ సరిగా లేకుంటే ఆటోమేటిక్‌గా జియో, ఎయిర్‌టెల్‌ టవర్ల నుంచి సిగ్నిల్స్ తీసుకుంటుంది. దీంతో వినియోగదారుడు పదేపదే సిగ్నల్స్ సమస్యతో ఇతర నెట్‌వర్కులకు మారకుండా సిగ్నల్స్ సమస్యలకు చెక్‌ పెట్టనున్నారు. జియో(Jio) సంస్థకు దేశవ్యాప్తంగా 35,400 టవర్లు ఉండగా ఏపీ సర్కిల్‌లో 3,715 ఉన్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL)కు దేశవ్యాప్తంగా 20,513 టవర్లు ఉండగా ఏపీలో 1370 ఉన్నాయి. ఎయిర్‌టెల్‌(Airtel0కు దేశవ్యాప్తంగా 2,038 టవర్లు ఉండగా మన దగ్గర 197 ఉన్నాయి. ఇప్పుడు ఈ టవర్లు ద్వారా ఈ మూడింటిలో ఏ నెట్‌వర్క్‌కు అయినా సిగ్నల్స్‌ ఆటోమేటిక్‌గా  వినియోగదారుకి చేరనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సమస్యలకు చెక్‌పడనుంది.


 

నాణ్యమైన సేవలు

వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు..మొబైల్ టవర్ ప్రాజెక్ట్‌ల నెట్‌వర్క్‌ పెంచేందుకు ప్రభుత్వ టెలికం సంస్థ డిజిటల్ భారత్‌ నిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మొబైల్‌ సేవలు అందుకోలేకపోతున్న మారుమూల గ్రామ ప్రజలకు ఈ సేవలు అందించడమే దీని ముఖ్యఉద్దేశం. పల్లెవాసులకు ఈ-గవర్నెన్స్‌, విద్య,ఆరోగ్య సంరక్షణ,ఆర్థికవృద్ధి వంటి ముఖ్యమైన సేవలు అందిచడమే డిజిటల్ భారత్‌ నిధి ముఖ్య ఉద్దేశం.