Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా మిత్రకు జ్యూస్‌లో డ్రగ్స్ కలిపి ఇచేస్తుంది. మిత్ర కళ్లు తిరుగుతున్నాయి అని అంటే మన ఫ్రెండ్స్ జ్యూస్‌లో ఆల్కాహాల్ కలిపారేమో అంటుంది. మిత్ర లక్ష్మీని పిలవమని తనని గదిలోకి తీసుకెళ్తుందని చెప్తే లక్ష్మీ ఎందుకులే మిత్ర నేను తీసుకెళ్తానని మనీషా మిత్రని తీసుకెళ్తుంది. 


అంజలి లక్ష్మీని తీసుకెళ్లి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడిస్తుంది. మరోవైపు జాను, పిల్లలు పూజలు చేస్తుంటారు. మిత్రకి ఫుల్ మత్తు ఎక్కిపోతుంది. మనీషా ఓ చోట కూర్చొపెట్టి వాటర్ తీసుకొస్తా అని చెప్పి వాటర్‌లో కూడా మాల్ కలిపి మిత్రకు ఇస్తుంది. మిత్ర మత్తుతో పడుకుండిపోతాడు. దాంతో మనీషా మిత్రని తీసుకొని గదిలోకి వెళ్లి నా కంట్రోల్ లోకి వచ్చేశావ్ మిత్ర అని అంటుంది. ఇక పిల్లలు లక్ష్మీకి కాల్ చేసి మీరు ఎప్పుడు వస్తారమ్మా మీరు వచ్చే వరకు తినమని పూజ చేస్తున్న విషయం చెప్తారు. దాంతో లక్ష్మీ వెంటనే బయల్దేరుతామని అంటుంది. లక్ష్మీ వెళ్లి మిత్ర కోసం చూస్తుంది. పార్టీలో మిత్ర ఉండకపోవడంతో అంజలిని మిత్ర గురించి అడుగుతుంది. మిత్ర అర్జెంట్ పని ఉందని హడావుడిగా వెళ్లిపోయాడని చెప్తుంది. మనీషా గురించి అడిగితే ఇక్కడే ఎక్కడో ఉందని చెప్తుంది. 


లక్ష్మీ మిత్ర ఫోన్‌కి కాల్ చేస్తుంది. మనీషా మిత్ర ఫోన్ తీసుకొని కాల్ కట్ చేస్తుంది. దాంతో లక్ష్మీ ఇంటికి వెళ్తానని అంటుంది. లక్ష్మీ వెళ్తుంటే మిత్ర ఫ్రెండ్ ఒకాయన మిత్రని ఒక్కడే చూశానని మనీషా రూమ్స్ కూడా బుక్ చేసిందని చెప్తాడు.  లక్ష్మీకి అనుమానం వచ్చి గది వైపు వెళ్తుంది. అంజలి మనీషాకి కాల్ చేసి చెప్తుంది. దాంతో మనీషా నేను చూసుకుంటా అంటుంది. ఇక లక్ష్మీ వచ్చి ఆ గది తలపు కొట్టగా మనీషా గొంతు మార్చి మాట్లాడుతుంది. దాంతో లక్ష్మీ సారీ చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ ఇంటికి వెళ్లిపోతుంది. అందరూ మిత్ర గురించి అడుగుతారు. దాంతో లక్ష్మీ ఆయన ఇంటికి వచ్చారని నేను వచ్చేశా అంటుంది. అందరూ కంగారు పడతారు. మనీషా గురించి అడిగితే మనీషా మిత్ర ఇద్దరూ ఒకే సారి కనిపించకుండా పోయారని అంటుంది. దాంతో వివేక్ మనీషాకి కాల్ చేస్తాడు. మనీషా కాల్ కట్ చేస్తుంది. వివేక్, జయదేవ్‌లు ఆఫీస్‌లో చూడటానికి వెళ్తారు. రాజేశ్వరి దేవి మనీషానే ఏమైనా చేసుంటుందని అంటుంది. 


ఉదయం మిత్రకు మత్తు వదిలి లేస్తాడు. ఎక్కడున్నానా అని మొత్తం చూస్తాడు. పక్కనే మనీషా బెడ్ షీట్‌ కప్పుకొని ఏడుస్తూ ఉంటే మిత్ర షాక్ అయిపోతాడు. నువ్వు ఉన్నావ్ ఏంటి మనీషా లక్ష్మీ ఎక్కడ ఉందని అడుగుతాడు. దాంతో మనీషా పెద్దగా ఏడుస్తూ రాత్రి నువ్వు ఏం చేశావో తెలీదా మిత్ర.. మన ఫ్రెండ్స్ డ్రింక్‌లో మందు కలిపారు. నిన్ను ఫ్రాంక్ చేయడానికి ప్లాన్ చేశారని అంటుంది. నేను ఏమైనా తప్పు చేశానా అని మిత్ర అడిగితే నేను ప్రేమించిన నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటే నీకు బెడ్ పార్టనర్ అయ్యానని నా లైఫ్ స్పాయిల్ చేసేశావ్ మిత్ర అని ఏడుస్తుంది. నాకు ఏం గుర్తు లేదు అని మిత్ర మనీషాకి సారీ చెప్తాడు. ఎందుకు ఇలా చేశావ్ మిత్ర అని ఏడుస్తుంది. మిత్ర తల పట్టుకుంటాడు. 


ఇక లక్ష్మీ ఉదయం వరకు హాల్‌లోని మెట్ల మీదనే కూర్చొంటుంది. జాను కాఫీ ఇస్తుంది. పెళ్లి రోజు కదా అక్క లేచి రెడీ అయి పూజ చేయు అక్క అంటుంది. ఇంతలో వివేక్, జయదేవ్‌లు వచ్చి మిత్ర ఎక్కడా లేడని అంటారు. లక్ష్మీ చాలా ఏడుస్తుంది. మిత్ర డ్రింక్ కూడా చేయలేదని చెప్తుంది. ఇంతలో వివేక్‌కి కాల్ వస్తుంది. మిత్ర సేఫ్ అని వివేక్ అందరితో చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మిత్రని రాత్రి ఫ్రెండ్స్ డ్రింక్ చేయించేశారని అందుకే అక్కడే పడుకున్నాడని చెప్తాడు. ఇక రాజేశ్వరి దేవి లక్ష్మీని రెడీ అవ్వమని పంపుతుంది. తమ్ముడితో జరిగింది అది కాదని ఏదో తేడాగా ఉందని అంటుంది. ఇక మనీషా బయటకు వచ్చి లగేజ్ కారులో పెట్టించేశారా అని నేను వెళ్లిపోతా అని చెప్పి బయల్దేరుతుంది. మనీషా సైగ చేయడంతో ఫ్రెండ్స్ అందరూ మిత్రతో మనీషా లైఫ్ నాశనం చేశావని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!