Satyabhama Serial Today February 7th: సత్యభామ సీరియల్: ఫస్ట్‌ నైట్ ఆటల్లో సత్యకి అవమానం.. చివరి నిమిషంలో మెలిక.. సంజయ్ ఆశలు అడియాసలేనా!

Satyabhama Today Episode సంధ్య, సంజయ్ బంతి ఆట ఆడటం సత్య కోపంతో బంతిని విసిరేయడంతో అందరూ సత్యని తిట్టి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Satyabhama Serial Today Episode సంధ్య, సంజయ్‌ల ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేసిన భైరవి వాళ్లతో తొలిరేయి రోజు ఆడించే ఆటలు ఏర్పాటు చేస్తుంది. మహదేవయ్య మనసులు ఆ సంజయ్‌ గాడు రేపో మాపో సంధ్యని వదిలేస్తాడు. అది తెలియక ఈ భైరవి ఏవవో ఏర్పాట్లు చేస్తుందని అనుకుంటాడు. క్రిష్ సత్యని, సంధ్యని చూసి అక్కాచెల్లెళ్ల మధ్య మంట త్వరగా చల్లారితే బాగున్ను అనుకుంటాడు.

Continues below advertisement

క్రిష్‌ తల్లితో డైరెక్ట్‌గా గదిలోకి పంపకుండా ఇప్పుడేంటి ఇవన్నీ అంటాడు. మాకు ఇవేం జరగలేదు మేం ఇప్పుడు జరుపుకుంటామని అంటాడు. ఇంతలో భైరవి సంధ్య అంత అదృష్టవంతురాలు సత్య కాదులే అంటుంది. బంతి ఆటలో క్రిష్ సంజయ్ వైపు ఉంటానని సత్యని చెల్లి వైపు ఉండమని అంటాడు. భైరవి సంధ్యతో నీ పుట్టింటి వాళ్లు ఎలాగూ లేరు కనీసం మీ అక్కని అయినా నీ వైపు ఉండమని చెప్పు అంటే దానికి సంధ్య నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అత్తయ్య మీరు ఉన్నారు చాలు అంటే భైరవి మురిసిపోతుంది. 

సంజయ్, సంధ్య ఇద్దరూ బంతి ఆట ఆడుతారు. భైరవి సంజయ్, సంధ్య ఇద్దరినీ ఎలా ప్రేమించుకున్నారని అడిగితే ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటుంటే సత్య చిరాకు పడుతుంది. ఇక బంతి ఆటలో సంధ్య విసిరిన మల్లెపూల బంతి క్రిష్ మీద పడితే క్రిష్ నేను కూడా నా ముచ్చట తీర్చుకుంటా అని బంతి సత్య మీదకు విసురుతాడు. సత్య దాన్ని పట్టుకొని కోపంతో నేల మీదకు విసిరి కొడుతుంది. 

భైరవి: చూశావురా నీ పెళ్లాం చెల్లి మీద ఎంత రగిలిపోతుందో.
సంధ్య: ఆ బంతి నా ముఖం మీద విసరాల్సింది అక్క అప్పుడు నీ కోపం చల్లారేది. అమ్మానాన్నల్ని నాకు దూరం చేశావ్. ఇప్పుడు నా సంతోషం కూడా దూరం చేయాలి అనుకుంటున్నావా.
భైరవి: ఇదంతా చూడటం ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పురా. చెల్లి సంతోషం చూసి ఏడ్చే చెల్లిని ఇక్కడే చూస్తున్నా.
మహదేవయ్య: మనసులో భైరవి సత్యతో ఆడుకుంటుంది కదా నాకు కావాల్సింది ఇదే.

సత్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. క్రిష్ కూడా సత్య వెనకాలే వెళ్తాడు. సత్య కోపంతో బెడ్ మీద అన్నీ విసిరేస్తుంది. క్రిష్ ఓదార్చడానికి వస్తే సత్య క్రిష్ మీద అరుస్తుంది. సంధ్య వచ్చినప్పుడు నుంచి అత్తయ్య ప్రవర్తన మారిపోయిందని దాన్ని నెత్తినెక్కించుకోమను కానీ నన్ను ఎందుకు అంటుందని అంటుంది. దాంతో క్రిష్ చిన్న పిల్లలా ఉంది నా సత్య తెగ ముద్దొచ్చేస్తుంది అని అంటాడు.  మీ అమ్మ మాటల వల్ల సంధ్య నన్ను శత్రువులా చూస్తుందని పోలీసుల్ని పిలిచి అమ్మానాన్నల్ని ఏడిపించిన సంధ్య నా వల్ల వాళ్లు దూరం అయ్యారని అంటుంది. సమస్యని దిగమింగుకొని  నువ్వు సత్యలా ఉండు అని ధైర్యం చెప్తాడు. 

సంజయ్, సంధ్యలు రింగ్ ఆట ఆడుతారు. రేణుక సంధ్యకి సపోర్ట్ చేస్తే రుద్ర సంజయ్‌కి సపోర్ట్  చేస్తాడు. రింగ్ సంధ్యకి దొరుకుతుంది. మగవాళ్లు అంతా అయ్యో అనుకుంటారు. దాంతో భైరవి మనసులో ఇది కూడా తక్కువది కాదని అనుకుంటుంది. ఇంతలో సత్య బయటకు వస్తారు. భైరవి శోభనం గదిలోకి పంపాలి అనుకుంటే సత్య చాలా టెన్షన్‌ పడుతుంది. ఇంతలో బామ్మ మూహూర్తం ఎంతకి అని అడుతుంది. ఏం లేదు అని బామ్మ అంటే అలా ఎలా కుదురుతుంది అని బామ్మ క్రిష్‌ని పంచాంగం తీసుకురమ్మని చెప్పి భైరవిని తిడుతుంది. బామ్మ సంజయ్‌తో నువ్వు శోభనం గదిలోకి వెళ్లరా... సంధ్య నువ్వు వచ్చి నా గదిలో పడుకో అంటుంది. అందరూ డల్ అయిపోతారు. ఈ రోజు శోభనానికి ముహూర్తమే లేదని బామ్మ చెప్తుంది. క్రిష్ అయితే బామ్మ వాడు రెడీ అయ్యాడే ఇప్పుడు లేదు అంటే వాడేమైపోతాడే అని అంటాడు. సత్య సంధ్యతో తన గదిలోకి వచ్చి పడుకో అని అంటుంది. మరి నేను అని క్రిష్ అంటే సంజయ్ నా గదిలో పడుకో అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: పుష్ప రేంజ్‌లో జ్యోత్స్నకి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్.. తల్లి నగలు చెక్ చేసిన జ్యోత్స్న!

Continues below advertisement