Google Chrome Updates: మ్యాక్‌బుక్ వినియోగదారులను ఫెర్రెట్ అనే కొత్త సైబర్ ముప్పు తలెత్తింది. సెంటినెల్‌ల్యాబ్స్ పరిశోధకులు ఈ మాల్వేర్‌ను గుర్తించారు. ఇది మ్యాక్‌బుక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ కొత్త మాల్వేర్‌తో ఉత్తర కొరియా హ్యాకర్లు, సైబర్ నేరస్థులకు సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు.  

ఫెర్రెట్ మాల్వేర్ ఎలా పని చేస్తుంది?ఫెర్రెట్ అచ్చం గూగుల్ క్రోమ్ అప్‌డేట్‌లా ఉంటుంది.  సెక్యూరిటీ చట్రాన్ని ఛేదించే శక్తి దీనికి ఉంది. చూడటానికి గూగుల్ క్రోమ్ అప్‌డేట్‌లా ఉన్న దీన్ని చూసిన వినియోగదారులు డౌన్‌లోడ్ చేస్తారు. అంతే మీ మ్యాక్‌బుక్‌లోకి మాల్‌వేర్ వచ్చి చేరిపోతుంది. ఇప్పటి వరకు మాల్వేర్ ఫేక్ జాబ్ ప్రకటనలు, ఇంటర్వ్యూలు లేదా ఇతర ఆన్‌లైన్ చర్యల ద్వారా ప్రవేశించేది ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నట్టు టెక్‌నిపుణులు చెబుతున్నారు. 

ఇప్పుడు కూడా నకిలీ ఇంటర్వ్యూలను సృష్టించి వాటి ద్వారానే క్రోమ్‌ అప్‌డేట్ చేయాలని చెబుతారు. లేదా జూమ్ అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తారు. వాళ్లు చెప్పినట్టు చేస్తే ఫెర్రెట్ మాల్వేర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాత వారికి కావాల్సిన డేటా, మీరు రెగ్యులర్ గా చేస్తున్న వివరాలను చోరీ చేస్తారు.  

ఆపిల్ హెచ్చరిక ఈ మాల్వేర్ గురించి తెలుసుకున్న ఆపిల్ సంస్థ అప్రమత్తైంది.  ఫెర్రేట్ ముప్పును తగ్గించడానికి XProtect ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. మీరు ఇంకా మీ మ్యాక్‌బుక్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోతే, వెంటనే దాన్ని అప్‌డేట్ చేయాలని చెబుతోంది. .

మాల్వేర్ ప్రభావం ఎలా ఉంటుందిపరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఈ మాల్వేర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అది చట్టబద్ధమైన సాఫ్ట్‌వేర్‌గా ఉంటూ అనేక హానికరమైన చర్యలకు పాల్పడుతుంది. ఇది షెల్ స్క్రిప్ట్‌ను ఉపయోగించి గూగుల్ క్రోమ్ అప్‌డేట్ లేదా జూమ్ సర్వీస్‌గా తనను తాను మార్చుకొని సిస్టమ్ ప్రారంభమైన ప్రతిసారీ దానిని యాక్టీవ్ అవుతూనే ఉంటుంది.  

డేటా చోరీ  ఈ మాల్వేర్ సున్నితమైన డేటాను సేకరించే పనిలో ఉంటుంది. డ్రాప్‌బాక్స్ ద్వారా సైబర్ నేరస్థులకు ఆ సమాచారాన్ని చేర వేస్తుంది.  

నివారణ మార్గాలేంటీ?

ఫెర్రెట్ మాత్రమే కాదు ఇలాంటి మాల్‌వేర్‌లు చాలనే ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. వినియోగదారులు చేసే పొరపాటులను ఆసరాగా చేసుకుని సిస్టమ్‌లోకి ప్రవేశిస్తాయి. దీన్ని నివారించడానికి కొన్ని జాగ్రత్తుల తీసుకోవాలి.  

తెలియని వ్యక్తులు పంపిన ఏ లింక్‌పైనా క్లిక్ చేయవద్దు.

ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా ఐటీ సపోర్ట్ పేరుతో ఇచ్చే సేవలను తీసుకోవద్దు. అనుమానాస్పద సాఫ్ట్‌వేర్ లేదా అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేయవద్దు.మీ మ్యాక్‌బుక్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి. భద్రతా సెట్టింగ్‌లను టైట్ చేయండి.  

Also Read: నథింగ్ 2ఏ కంటే నథింగ్ ఫోన్ 3ఏ బెస్ట్ ఆప్షనా.. ఏ విషయంలో.. ఎందుకు..?