ihone SE 4 : చాలా మందికి ఐఫోన్ యూజ్ చేయాలని ఉంటుంది. కానీ దాని భారీ ధర రిత్యా కొనలేని పరిస్థితి. లక్షలు పెట్టి ఐఫోన్ కొనే స్థోమత లేని వాళ్లు కనీసం మన జీవితం మొత్తంలోనైనా ఈ ఫోన్ కొంటామా అని భావిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఓ శుభవార్త. త్వరలో ఈ బ్రాండ్ నుంచి అత్యంత చవకైన ఫోన్ రాబోతోంది. ఐఫోన్ ఎస్ఈ 4 పేరుతో రానున్న ఈ కొత్త ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది. బ్లూమ్ బెర్గ్ మార్క్ గుర్మాన్ ప్రకారం, వచ్చే వారం ఐఫోన్ ఎస్ 4 ఫోన్ ను విడుదల చేసేందుకు ఆపిల్ యోచిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫొటోలు సైతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫోన్ లాంచింగ్ కు కంపెనీ ఎలాంటి ప్రత్యేక ఈవెంట్ ను నిర్వహించేందుకు ఆసక్తి కనబర్చట్లేదని గుర్మాన్ ప్రకారం తెలుస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఎస్ 4ను ప్రెస్ రిలీజ్ ద్వారా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలాఖరులో సేల్ లైవ్ టెలికాస్ట్ కానున్నట్టు సమాచారం.
ఐఫోన్ ఎస్ఈ 4
డిజైన్ : ఐఫోన్ ఎస్ఈ 4 ప్రస్తుత ఐఫోన్ ఎస్ఈలో కనిపించే మందపాటి బెజెల్స్, టచ్ ఐడీ హెమ్ బటన్ ను భర్తీ చేస్తూ.. ఐఫోన్ 14 మాదిరిగానే డిజైన్ ఉండనుందనే ప్రచారం నడుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తో ఆపిల్ తన ఐఫోన్ లైనప్ నుంచి టచ్ ఐడీని పూర్తిగా తొలగిస్తుందని భావిస్తున్నారు.
డిస్ ప్లే : లీకైన కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.06 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లేతో రానుంది. 6జీబీ, 8జీబీ అనే రెండు రకాల ర్యామ్ వేరియంట్లలో ఈ మోడల్ లాంచ్ కానుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోల ప్రకారం, ఇది వైట్ అండ్ బ్లాండ్ రెండు కలర్స్ లోనూ అందుబాటులోకి రానుంది. ఇక ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ ప్లేతో పాటు ఫోన్ ఫోన్ కుడివైపున పవర్ బటన్ ఉంటుంది.
కెమెరా : కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో 48 మెగా పిక్సల్ ప్రైమరీ రియల్ కెమెరా, 24 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉండనుంది. దీంతో పాటు బ్యాటరీ లైఫ్, ఇతర హార్డ్ వేర్ పార్ట్స్ లోనూ అప్ గ్రేడ్స్ ను ఆశించవచ్చు.
ఐఫోన్ ఎస్ఈ 4 అంచనా ధర
ఐఫోన్ ఎస్ఈ 4 ధర సుమారుగా 499 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.43,200 నుంచి ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఐఫోన్ ఎస్ఈ 3 లాంచ్ ధర 429 డాలర్ల కంటే ఎక్కువ. భారతదేశంలో దీని ధర రూ.43,900 వద్ద ప్రారంభమైనప్పటికీ.. కొన్ని నెలల్లోనే దీని ధర రూ.49,900కి పెరిగింది. మరి రాబోయే ఎస్ఈ 4 అప్ గ్రేడ్ చేసిన మరిన్ని ఫీచర్లతో రాబోతున్నందున దీని ధర దేశంలో రూ.50వేల మార్క్ కంటే తగ్గుతుందా, పెరుగుతుందా అన్న విషయం మాత్రం లాంచ్ తర్వాతే తెలుస్తుంది.
Also Read : Best Selling Smartphone : 2024లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఇదే - టాప్ 10 జాబితా ఇదే