Best Selling Smartphone : ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి అనేక మొబైల్ కంపెనీలు వచ్చి, తమ సత్తాను చాటుతున్నాయి. కొత్త డిజైన్లు, ఆఫర్లు, ఫీచర్లు అంటూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. అయితే ఈ సమయంలో మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ (Counter Point) ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ పేరును వెల్లడించింది. ఇందులో మిడిల్ రేంజ్ (Mid-range)తో పాటు ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. టాప్ 10 జాబితాలో ఆపిల్ (Apple) ముందంజలో ఉండగా, తరువాతి స్థానాన్ని శామ్ సంగ్ (Samsung) దక్కించుకుంది.


ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్


ప్రముఖ దిగ్గజ సంస్థ ఆపిల్ (Apple)కు చెందిన ఐఫోన్ 15 (iPhone 15).. 2024లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max), ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max), ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) కూడా ఉన్నాయి. కానీ ఇవి 5వ, 9వ స్థానాల్లో ఉన్నాయి. ఇక శామ్ సంగ్ గెలాక్సీ ఏ15 5జీ (Samsung Galaxy A15 5G), శామ్ సంగ్ గెలాక్సీ ఏ 15 4జీ (Galaxy A15 4G), గెలాక్సీ ఏ05 (Galaxy A05), గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Galaxy S24 Ultra)తో సహా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలను పొందింది. గెలాక్సీ ఎస్ (Galaxy S) సిరీస్ 2018 నుండి మొదటిసారి టాప్ 10కి తిరిగి వచ్చింది. 


Also Read : Noise Airwave Max 5 : అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి నోయిస్ కంపెనీ ఇయర్ ఫోన్లు.. ధర ఎంతంటే ?


మొదటిసారి టాప్ 10లోకి Samsung Galaxy S24 Ultra


మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా (Galaxy S24 Ultra) 2018 నుంచి ఈ సారి మొదటిసారిగా టాప్ 10 జాబితాలోకి వచ్చింది. ఏఐ (AI) ఫీచర్లతో పాటు చాట్/నోట్ అసిస్ట్, సెర్చ్ చేయడానికి సర్కిల్, లైవ్ ట్రాన్స్‌లేషన్ (Live Translation) వంటి ఫీచర్లు దాని మెరుగైన పనితీరుకు సాక్ష్యంగా నిలిచాయి. ఇక శాంసంగ్ ఏ-సిరీస్ కూడా ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. వీటిలో ముఖ్యంగా ఐదు గెలాక్సీ A15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి.


2024లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌లు



  • ఐఫోన్ 15

  • ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్

  • ఐఫోన్ 15 ప్రో

  • శామ్ సంగ్ గెలాక్సీ ఏ15 5జీ

  • ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 

  • శామ్ సంగ్ గెలాక్సీ ఏ 15 4జీ

  • గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా

  • ఐఫోన్ 14

  • ఐఫోన్ 16 ప్రో 

  • గెలాక్సీ ఏ05 


Also Read : WhatsApp confirms Spyware attack: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్ - 24 దేశాల్లో వాట్సాప్ పై స్పైవేర్ ఎటాక్