WhatsApp confirms Spyware attack in over 24 countries: వాట్సాప్ ఉపయోగిస్తున్న వారందరికీ  చాలా కీలకమైన విషయం. Meta  ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై స్పైవేర్ ఎటాక్ చేసింది. మొత్తగా ఇరవై  నాలుగు దేశాల్లో దాదాపుగా 90 మంది వినియోగదారులనులక్ష్యంగా చేసుకుని ఈ స్పైవేర్ ఎటాక్ చేసినట్లుగా వాట్సాప్ గుర్తించింది. ఇందులో అత్యధిక మంది యూరప్ లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. వాట్సాప్ స్పైవేర్ ఎటాక్ జరిగిన వారిలో ఎక్కువగా జర్నలిస్టులు, వివిద సంస్థలకు చెందిన వారు, ఉద్యమకారులు  ఉన్నట్లుగా చెబుతున్నారు.  హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ కంపెనీ పారగాన్ సొల్యూషన్స్ ఈ స్పైవేర్ ఎటాక్ చేసినట్లుగా ప్రాథమికంగా ఓ నిర్దారణకు వచ్చారు. 


వాట్సాప్ లో స్పైవేర్ ను ప్రవేశ పెట్టడానికి పారగాన్ సొల్యూషన్స్ ఓ ఒక ఊహించని పద్ధతిని ఉపయోగించిందని WhatsApp ధృవీకరించింది.  గ్రూప్ చాట్‌లలో హానికరమైన PDF ఫైల్‌ను పంపుతుంది..  ఆ ఫైల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫోన్ లో డెలివరీ కాగానే స్పైవేర్ ఎటాక్ చేస్తుంది. అయితే ఈ స్పైవేర్ ను వాట్సాప్ గుర్తించి ఆయా వినియోగదారులను  అలర్ట్ చేసినట్లుగా ప్రకటించారు.  ఈ స్పైవేర్ అటాక్ ను జీరో క్లిక్ ఎటాక్ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.  అంటే బాధితులు ఇతర హానికరమైన ఫైల్‌ల మాదిరిగా కాకుండా వారి ఫోన్‌లను హ్యాక్ చేయడానికి ఫైల్‌ను తెరవాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ గ్రూపులోకి ఆ ఫైల్ వస్తే చాలు.


ఈ స్పైవేర్ ఫోన్‌లో చేరితే  అది అన్ని ఎన్‌క్రిప్ట్ చేసిన సందేశాలు, ఫోటోలు ,కాంటాక్ట్స్  యాక్సెస్ చేయగలదు .  కెమెరా,  మైక్రోఫోన్‌ను కూడా ఆన్ చేయగలదు.స్పైవేర్ ఎటాక్ జరిగినట్లుగా కనిపెంటిన వెంటనే.. వాట్సాప్ గుర్తించింది. వెంటనే   పారగాన్ సొల్యూషన్స్‌కు  వాట్సాప్ హెచ్చరిక  పంపింది.  చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించిది. అయితే  పారగాన్ సొల్యూషన్స్ మౌనంగా ఉంది. ఈ  కంపెనీ గతంలో US ఇమ్మిగ్రేషన్ , కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE)తో $2 మిలియన్ల ఒప్పందం చేసుకుంది.  కానీ స్పైవేర్ వినియోగాన్ని ప్రభుత్వం పరిమితం చేస్తూ 2023 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా ఆ ఒప్పందం అమల్లోకి రాలేదు. 


పారగాన్ సొల్యూషన్స్  చేస్తున్న స్పైవేర్ ఎటాక్స్ కారణంగా వాటిని  బ్లాక్ చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. అయితే అదే కాదు ఇతర స్పైవేర్లు కూడా వాట్సాప్ పై ఎటాక్ చేయవచ్చు. మన వాట్సాప్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే ఈ సమస్యలు రావు. ఏం చేయాలంటే? 


- మీ యాప్‌లు మరియు ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి.
- తెలియని నంబర్‌ల నుండి మీకు ఏవైనా లింక్‌లు లేదా ఫైల్‌లు వస్తే బ్లాక్ చేయడం ఉత్తమ మార్గం.
 - అదనపు భద్రత కోసం డబుల్ సెక్యూరిటీ చెక్ అప్ చేసుకోండి.  
-  వాట్సాప్ అనుమతులు, సెట్టింగ్‌లను క్రమం తప్పకుండా  చెక్ చుసుకోవాలి.           


 



Also Read: ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు అదిరిపోయే న్యూస్ - ఏకంగా రూ.20 కోట్ల వరకు రుణాలు