BCPL: బీసీపీఎల్‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులు- ఈ అర్హతలుండాలి

BCPL Apprentices: బీసీపీఎల్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

BCPL Recruitment: బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలిమర్ లిమిటెడ్(BCPL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్‌ (ACT Apprentice) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 70 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాలో డిప్లొమా, డిగ్రీ, బీటెక్( సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 70 

విభాగాలు: మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, టెలికాం, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రానిక్స్, హ్యూమన్ రీసోర్స్, ఎఫ్ & ఏ.

⏩ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ మెకానికల్: 10 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్- 05 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 02 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ కెమికల్: 12 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 06 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 02 పోస్టులు, ఓబీసీ- 03 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ ఎలక్ట్రికల్: 06 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత:  కనీసం 55% మార్కులతో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 06 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 00 పోస్టు, ఎస్టీ- 01 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ టెలికాం: 01 పోస్టు
పోస్టుల కేటాయింపు:  జనరల్- 01 పోస్టు.
అర్హత: కనీసం 55% మార్కులతో ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్& ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ & టెలికమ్యుటేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ కంప్యూటర్ సైన్స్: 01 పోస్టు
పోస్టుల కేటాయింపు:  జనరల్- 01 పోస్టు.
అర్హత: కనీసం 55% మార్కులతో కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ సివిల్: 03 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు.
అర్హత: కనీసం 55% మార్కులతో సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ కాంట్రాక్ట్ & ప్రొక్యూర్‌మెంట్: 02 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 02 పోస్టులు.
అర్హత: కనీసం 55% మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ హ్యూమన్ రీసోర్స్/PRCC/మార్కెటింగ్: 06 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 00 పోస్టు, ఎస్టీ- 01 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

➥ ఎఫ్ & ఏ: 02 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 02 పోస్టులు.
అర్హత: కనీసం 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్) లేదా బీకామ్ కలిగి ఉండాలి.

⏩ టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు..

➥ మెకానికల్: 05 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 00 పోస్టు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.

➥ కెమికల్: 06 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 01 పోస్టు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.

➥ ఎలక్ట్రికల్: 05 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 00 పోస్టు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత:  కనీసం 55% మార్కులతో ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి.

➥ ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 05 పోస్టులు 
పోస్టుల కేటాయింపు: జనరల్- 03 పోస్టులు, ఎస్సీ- 00 పోస్టు, ఎస్టీ- 00 పోస్టులు, ఓబీసీ- 02 పోస్టులు. 
అర్హత: కనీసం 55% మార్కులతో ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్/ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ &ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 31.01.2025 తేదీ నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు నెలకు రూ.9000, టెక్నీషియన్ పోస్టులకు రూ.8000.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement