Thaman Comments About Marriage Gone Viral: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో సత్తా చాాటారు. డాకు మహారాజ్‌కు తమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఇక తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్‌లో పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌లో పెళ్లి అంటేనే వేస్ట్ అని.. తనను అడిగితే పెళ్లి చేసుకోకపోవడమే బెస్ట్ అని కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న మైండ్ సెట్లకు పెళ్లిళ్లు వేస్ట్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

'ఇప్పుడు అమ్మాయిలు ఇండిపెంటెండ్ అయ్యారు. ఒకరి మీద ఆధారపడి వాళ్లు బతకాలని అనుకోవడం లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం సోషల్ మీడియా ప్రభావం సైతం ఎక్కువైంది. ప్రజల మైండ్ సెట్ కూడా మారింది. కలిసి ఉండాలనే ఆలోచనా ధోరణి మారిపోయింది. పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే విడిపోతున్నారు. అందుకే ఈ పెళ్లిళ్లు ఇప్పుడు వేస్ట్ అని అంటున్నాను. నన్ను ఎవరైనా సలహా అడిగితే మాత్రం పెళ్లి వద్దు అనే అంటాను.' అని తమన్ చెప్పారు.

ప్రజెంట్ బిజీ బిజీ..

కాగా, టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకరు. సంక్రాంతికి ఆయన సంగీతం అందించిన డాకు మహారాజ్ బీజీఎంకు థియేటర్లు దద్దరిల్లాయి. కంటిన్యూ ప్రాజెక్టులతో ప్రస్తుతం ఆయన బిజీగా గడుపుతున్నారు. ప్రజెంట్ ఆయన అఖండ 2 పనుల్లో ఉన్నారు. ఆయన చేతిలో ప్రభాస్ - మారుతి కాంబోలో తెరకెక్కుతున్న 'రాజా సాబ్', పవన్ కల్యాణ్ - సుజూత్ 'ఓజీ' వంటి బడా ప్రాజెక్టులు సైతం ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు సైతం తమన్ సంగీతం అందిస్తున్నారు.

మళ్లీ యాక్టింగ్..!

తాజాగా, ఆయన యాక్టర్‌గానూ అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ 2003లో తెరకెక్కించిన 'బాయ్స్' సినిమాలో తమన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తమన్ ఆన్ స్క్రీన్ మీద ఆయన కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తమన్ లీడ్ రోల్‌లో తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో అథర్వతో కలిసి మల్టీస్టారర్‌గా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. రీసెంట్‌గా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'బేబీ జాన్'లోనూ తమన్ క్యామియో రోల్‌లో మెరిశారు.

Also Read: Sai Pallavi: అబ్బాయిలు ఎలా ఉంటే సాయిపల్లవికి నచ్చుతారో తెలుసా? - చైతూ క్రేజీ క్వశ్చన్స్, సాయిపల్లవి క్రేజీ ఆన్సర్స్