Naga Chaitanya Interesting Questions To Sai Pallavi: నాగచైతన్య, సాయిపల్లవి (Saipallavi) జంటగా నటించిన చిత్రం 'తండేల్' (Thandel). ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికా, యూకేల్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అయ్యాయి. సినిమాలో 'తండేల్ రాజు'గా నాగచైతన్య (Naga Chaitanya) నటన హైలైట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్యను సాయి పల్లవి.. అలాగే సాయిపల్లవిని నాగచైతన్య ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేశారు. పలువురు అభిమానులు అడిగిన ప్రశ్నలకు వారు క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. వీటిని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
క్రేజీ ఆన్సర్స్..
- అబ్బాయిలు ఎలాంటి డ్రెస్‌లు వాడితే నచ్చుతారంటూ.. అడిగిన ప్రశ్నకు.. 'నాకు తెలియదు. నలిగిపోయిన బట్టలు వేసుకుంటే నాకు నచ్చదు. నా ఫ్యామిలీలో ఎవరైనా అలా కనపడితే, వాటిని సరిచేయడానికి ప్రయత్నిస్తా.' అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి స్పందించిన నాగచైతన్య.. 'అబ్బాయిలూ విన్నారుగా.. ఈసారి సాయిపల్లవిని కలిసే ముందు, మీ డ్రెస్‌ను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి వేసుకుని రండి' అంటూ సలహా ఇచ్చారు.
- నటన కాకుండా సాయిపల్లవికి ఫ్యాషన్ ఏందంటే..? తనకు తేనెటీగల పెంపకం అంటే చాలా ఇష్టమని.. ఇటీవలే మొదలు పెట్టినట్లు కూడా సాయిపల్లవి చెప్పారు.
- దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా.? అనే ప్రశ్నకు.. తాను దర్శకత్వం చేయనని.. అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. దీనికి స్పందించిన నాగచైతన్య.. 'నువ్వు అబద్ధాలు చెబుతున్నావు. ఇంతకు ముందు ఇదే విషయం అడిగితే ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తా. నన్ను కూడా నటుడిగా తీసుకుంటానని చెప్పావు.' అంటూ సరదాగా అన్నారు.
- సినిమాలో చైతన్య డ్యాన్స్ చూసి ఏమనిపించింది.? అనే ప్రశ్నకు.. గతంలో చైతన్య డ్యాన్స్ చేస్తుండగా.. అప్పుడప్పుడు వెనకడుగు వేసేవాడు. సినిమాలో నమో నమః పాటకు మాత్రం ముందుకు దూకి మరీ ఇరగదీశాడు. అంటూ రిప్లై ఇచ్చారు.
- శ్రీకాకుళం యాస ఎలా అనిపించింది.?.. తొలుత సంభాషణలు పలకడానికి ఇబ్బంది పడిన మాట వాస్తవమే. గతంలోనూ తెలంగాణ యాస నేర్చుకుని మాట్లాడాను. అలానే ఇది కూడా.
- ఖాళీ టైంలో సాయిపల్లవి ఏం చేస్తుంది.?.. ఖాళీ టైంలో నేను నాలా ఉండడానికి ప్రయత్నిస్తాను. వంట చేయాలనుకుంటాను కానీ చేయలేను. ఆర్డర్ పెట్టి తినేస్తా. క్యారెట్లు పండిస్తా. సినిమాలు చూస్తాను. అంటూ రిప్లై ఇచ్చారు.
నాగచైతన్య క్రైజీ ఆన్సర్స్
అంతకు ముందు నాగచైతన్యను సైతం సాయిపల్లవి ఇంటర్వ్యూ చేశారు. "యాక్టింగ్ ఎప్పుడు నేర్చుకుంటావు?" అనే ఓ నెటిజన్ ప్రశ్నకు నాగ చైతన్య రియాక్ట్ అవుతూ.. 'నిజానికి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్. కాలం గడిచే కొద్ది నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ ఈ ప్రాసెస్‌కి ఫుల్ స్టాప్ పెట్టొద్దు. ఒకవేళ ఫుల్ స్టాప్ పెడితే గనక నటుడుగా ఎదగడం మానేసినట్టే. అంటే ఫ్యూచర్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. నేను ఇంకా నేర్చుకోలేదు... ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉన్నాను'. అని చెప్పారు నాగచైతన్య.