Vivo T3 Ultra Launched: వివో టీ3 అల్ట్రా స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లేటెస్ట్ టీ సిరీస్‌లో ఈ మొబైల్ మార్కెట్లోకి రానుంది. ఇందులో 1.5కే రిజల్యూషన్ ఉన్న కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. వివో వీ40 ప్రోలో కూడా ఇదే కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్లను అందించారు.
వివో టీ3 అల్ట్రా ధర (Vivo T3 Ultra Price in India)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.31,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గానూ ఉంది. ఫ్రాస్ట్ గ్రీన్, లూనార్ గ్రే కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందించనున్నారు. దీంతో బేస్ వేరియంట్‌ను రూ.28,999కే కొనుగోలు చేయవచ్చు. మిగతా వేరియంట్లపై కూడా ఈ తగ్గింపు లభించనుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
వివో టీ3 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo T3 Ultra Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ3 అల్ట్రా రన్ కానుంది. ఇందులో 6.78 అంగుళాల 1.5కే కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ ప్రాసెసర్‌పై ఇది రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. ఆరా లైట్ ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 సెన్సార్ అందించారు. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 4,200 మిల్లీమీటర్ స్క్వేర్ వీసీ కూలింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంది.
బ్లూటూత్ వీ5.3, 5జీ, జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, బైదు, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, జీఎన్ఎస్ఎస్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఐపీ68 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించారు. వివో టీ3 అల్ట్రా బ్యాటరీ సామర్థ్యం 5500 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే