How to unsend emails : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ఈ మెయిల్ సర్వీసుల్లో జీమెయిల్ ఒకటి. ఈ మెసేజ్ సెండింగ్ అప్లికేషన్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందుకంటే యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు సెక్యూరిటీ పరంగా యూజర్లకు భరోసా ఉండటం వల్ల మెయిల్స్ పంపేందుకు జీ మెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే జీమెయిల్లో మెయిల్స్ పంపేటప్పుడు చాలా సార్లు పొరపాటున మెయిల్ సెండ్ అయిపోతుంటుంది. మరి దానిని వెంటనే అన్‌సెండ్ చేయడం ఎలానో తెలుసుకుందాం.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో పాటు ఉద్యోగ, వృత్తి అవసరాలకూ తప్పనిసరిగా అయిపోయింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్లో భాగంగా ఎన్నో మెసేజ్ సెండింగ్ అప్లికేషన్స్ కూడా ప్రతి ఒక్కరికీ ఎంతో నిత్యవసరమయ్యాయి. వీటిలో మెయిల్ కూడా ఒకటి. ప్రతి రోజూ ఎన్నో మెయిళ్లను అందుకోవటం, పంపటం మనం చేస్తూనే ఉంటాం.
దీంతో మెయిల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకు కూడా దీనికి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆఫీస్‌లకు సంబంధించి కచ్చితంగా మెయిల్స్ చేయాల్సి వస్తుంది. అయితే మనం ఈ మెయిల్స్ పంపేటప్పుడు చాలా సార్లు మెయిల్ పొరపాటున సెండ్ అయిపోతుంటుంది. మరి వెంటనే అన్ సెండ్ చేద్దామనుకున్నా అది కుదరదు. ఎందుకంటే మెయిల్‌ను అన్‌సెండ్ చేసే ఆప్షన్ అందులో ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? మెయిల్‌ను అన్‌సెండ్ ఎలా చేయాలి? మెయిల్‌ను అన్‌సెండ్ చేసేందుకు ఈజీగా ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.
మెయిల్ అన్‌సెండ్ ఫెసిలిటీ - జీమెయిల్లో మెయిల్ అన్‌సెండ్ చేసే అవకాశం ఉంటుంది! ఎలా అంటే మెయిల్ యూజర్స్ వారి ప్రాధ్యాన్యత ప్రకారం మెయిల్ పంపించే సమయాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో జీమెయిల్లో మెయిల్ అన్ సెండ్ చేసే ఆప్షన్‌ను పొందొచ్చు.
మెయిల్ అన్‌సెండ్ ప్రాసెస్ - ముందుగా మీ ల్యాప్ ట్యాప్ లేదా డెస్క్‌టాప్‌లో జీ మెయిల్ యాప్‌ను ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత టాప్ బార్లో ప్రొఫైల్ ఐకాన్ పక్కన కనిపించే సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం See All Settingsపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్ర్కోల్ బార్‌ను కిందకు డౌన్ చేసి ప్రిఫరెన్స్‌ను బట్టి మెయిల్ పంపించేందుకు సమయాన్ని ఎంచుకోవాలి. అలా చేసినప్పుడు ఎంత సమయాన్ని అయితే సెట్ చేసుకుంటారో అదే వ్యవధికి మెయిల్ అన్ సెండ్ చేసే ఆప్షన్ కూడా లభిస్తుంది.
ఉదాహరణకి మీరు మీ మెయిల్‌ను పంపడానికి 2 గంటల తర్వాత సమయాన్ని సెట్ చేశారనుకుంటే. అదే వ్యవధికి పంపిన మెయిల్‌కు అన్ సెండ్ చేసే ఆప్షన్ మనకు అక్కడ కనిపిస్తుంది. అప్పుడు కిందికి స్క్రోల్ చేసి సబ్మిట్ చేయాలి. దీంతో సెట్టింగ్ పూర్తి అవుతుంది. అలా సింపుల్‌గా ఈ మెయిల్‌ను అన్ సెండ్ చేసే ఆప్షన్‌ను పొందవచ్చు.
టెక్ట్స్ ఎడిట్ ఆప్షన్ - మెయిల్ క్యాన్సిల్ చేశాక దాన్ని మళ్లీ రీసెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు Edit it లేదా Add Some New Content అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ఆప్షన్లు కూడా కనిపిస్తాయి. స్పెల్లింగ్ సజిషన్స్ అన్/ఆఫ్ ఫీచర్ కూడా అందుబాటులో కనిపిస్తుంది. కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ను కూడా ఎనేబుల్/డిసేబుల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.