Vivo Diwali Offers: ప్రస్తుతం మనదేశంలో దీపావళి సేల్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. భారతీయులు ఏదైనా ఖరీదైన, కొత్త వస్తువు కొనాలంటే పండగల సందర్భంలో కొనడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతో అన్ని కంపెనీలూ పండగల సమయంలో ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పుడు వివో కూడా అదే బాట పట్టింది. తన స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లను అందిస్తోంది. నవంబర్ 15వ తేదీ వరకు వివో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోనూ ఈ ఆఫర్లు అందిస్తుంది. లేటెస్ట్ ఫోన్లపై కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


వివో ఎక్స్90 సిరీస్‌పై సూపర్ ఆఫర్
వివో ఫ్లాగ్ షిప్ సిరీస్ అయిన ఎక్స్90 సిరీస్‌పై (Vivo X90) ఈ సేల్‌లో భారీ ఆఫర్లు అందిస్తున్నారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, హెచ్ఎస్‌బీసీ, యస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డులతో ఈ ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే వివో వీ29 (Vivo V29), వివో వీ29 ప్రో (Vivo V29 Pro) స్మార్ట్ ఫోన్లపై కూడా ఈ కార్డులపై రూ.4,000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అదనపు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.8,000 అదనపు తగ్గింపు పొందవచ్చు. అంటే కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.18 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట.


దీంతోపాటు కంపెనీ వై-సిరీస్ ఫోన్లపై కూడా ఆఫర్లు అందిస్తుంది. గత నెలలో లాంచ్ అయిన వివో వై200పై (Vivo Y200) రూ.2,500 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. వివో వై56, వివో వై27 స్మార్ట్ ఫోన్లపై రూ.1,000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, కొటక్ మహీంద్రా, వన్ కార్డు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ కార్డులపై కొనుగోలు చేస్తే ఈ ఆఫర్లు లభించనున్నాయి.


దీంతోపాటు వివో వై27 స్మార్ట్ ఫోన్‌పై కంపెనీ ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను అందించింది. ఇది రూ.101 నుంచి ప్రారంభం కానుంది. దీంతో పాటు వివో వీ-షీల్డ్ ప్లాన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుందని కంపెనీ తెలిపింది.


మరోవైపు వివో వీ29ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టులో మనదేశంలో లాంచ్ అయింది. వివో వీ29 సిరీస్‌లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. జూన్‌లో గ్లోబల్ లాంచ్ అయిన వివో వీ29 లైట్ 5జీ తరహాలోనే దీని ఫీచర్లు ఉన్నాయి. వివో వీ29ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999గా నిర్ణయించారు. ఆర్టిస్టిక్ బ్లూ, ఆర్టిస్టిక్ రెడ్ కలర్ ఆప్షన్లలో వివో వీ29ఈని కొనుగోలు చేయవచ్చు. వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. 


వివో వీ29ఈ కొనుగోలుపై రూ.2,000 వరకు అడిషనల్ డిస్కౌంట్ లభించనుంది. అంతే కాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరో రూ.2,500 తగ్గించనున్నారు. దీంతోపాటు కొన్ని కార్డుల వినియోగదారులకు కూడా రూ.2,500 వరకు అదనపు తగ్గింపు కూడా లభించనుంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?