Bhagavad Gita: సనాతన ధర్మమైన హిందూమతంలో శ్రీమద్ భగవద్గీతకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భగవద్గీతను శ్రీకృష్ణుని రూపంలో పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, భగవద్గీతను సంపూర్ణ భక్తితో పఠించే వ్యక్తి, దాని విలువలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పటికీ విఫలం కాడు. ఎందుకంటే విజయాన్ని సాధించే అనేక రహస్యాలు భగవద్గీత ద్వారా వెల్ల‌డ‌య్యాయి. భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి కర్మ ప్రాముఖ్యత ఏంటి? తను కర్మ ఫలాలను ఎలా పొందుతాడు


1. భగవద్గీత శ్లోకం - 1
"యద్దచరతి శ్రేష్టసత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే||''


అర్థం: శ్రీమద్ భగవద్గీత, మూడవ అధ్యాయం, 21వ శ్లోకం, కర్మ ఫలాన్ని ఇలా పేర్కొంది. దీని ప్రకారం, గొప్ప లేదా ప్రసిద్ధ వ్యక్తి తన ప్రవర్తనను స్వచ్ఛంగా ఉంచుకుంటాడు. ఒక ప్రముఖ వ్యక్తి లేదా గొప్ప వ్యక్తి యొక్క ప్రవర్తన చెడుగా ఉంటే, ఇతర వ్యక్తులు కూడా అదే ప్రవర్తనను అవలంబిస్తారు. అతని ప్రవర్తనను ఇతరులు అనుకరిస్తారని ఈ శ్లోకంలో తెలిపారు.


Also Read : అనవసర విషయాల గురించి బాధపడుతున్నారా - గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా!


2. భగవద్గీత శ్లోకం - 2
''యో హృష్యతి ద్విష్టి శోచతి కదక్షతి|
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః||''


అర్థం: భగవద్గీత 12వ అధ్యాయం 17వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఇందులో శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుడి గురించి చెప్పాడు. ఎప్పటికీ మితిమీరిన కోరికలు లేనివాడు, ద్వేషాన్ని పొందనివాడు, అన్ని శుభ, అశుభ ఫలాలను సమంగా స్వీకరించేవాడు, భగవంతునిపై మనసు పెట్టేవాడు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రుడు. అలాంటి వ్య‌క్తి భగవంతుడైన శ్రీ‌మ‌హా విష్ణువు పాదాల చెంత ఉంటాడు.


3. భగవద్గీత శ్లోకం - 3
''కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భు మా తే సంగోస్త్వకర్మణి||''


అర్థం: ఒక వ్యక్తి తన పనిపైనే హక్కులను కలిగి ఉంటాడు, దాని వ‌ల్ల వ‌చ్చే ఫలితాలపై అత‌నికి ఎలాంటి హ‌క్కు ఉండ‌దు. కాబట్టి, మీ చర్యల ఫలితాల గురించి లేదా మీరు చేసే ప‌ని విజ‌య‌వంత‌మ‌వుతుందా అని ఎక్కువగా ఆలోచించవద్దు. ఫ‌లిత‌లం సానుకూలంగా ఉంటుందా..? ఉండ‌దా..? అనే దాని గురించి ఆలోచించవద్దు. గీతలోని నాల్గవ అధ్యాయంలోని 37వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మను ప్రధాన ఇతివృత్తంగా వర్ణించాడు. ఒక వ్యక్తి తను త‌ల‌పెట్టిన‌ పని నుంచి వైదొలగకూడదని పేర్కొన్నాడు.


Also Read : భగవద్గీత మొత్తం చదవలేదా అయితే ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి చాలు!


భగవద్గీత అధ్యాయం మూడు, నాలుగు, 12వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మ గురించి వివరంగా చెప్పాడు. వీటిని తనలో ఇముడ్చుకున్న వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయాల మెట్లు ఎక్కుతాడు. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.


Also Read: ఈ రాశులవారు ఈ రోజు ఆర్థికంగా నష్టపోతారు, నవంబరు 08 రాశిఫలాలు