2018లో పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్‌తో పోకో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు సంవత్సరం పాటు మరే స్మార్ట్ ఫోన్ విడుదల చేయకపోయినా.. మార్కెట్లో ఆ బ్రాండ్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. పోకో ఎఫ్1 అంత పెద్ద సక్సెస్ అయింది మరి! ఆ తర్వాత కూడా పోకో కొన్ని స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొన్ని హిట్ కాగా.. కొన్ని వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే పోకో ఎఫ్1 సమయంలో ఉన్న హైప్ ఇప్పుడు లేదు అన్నది మాత్రం వాస్తవం.


కానీ పోకో ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తుందంటే పోకో ఎఫ్1 తరహాలో ఉంటుందేమో అనుకుంటూ ఫ్యాన్స్, స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారు వెయిట్ చేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్లే పోకో తన తర్వాతి లైనప్‌ను ఎక్సైటింగ్‌గా ప్లాన్ చేసింది. 2022 మొదటి త్రైమాసికంలో పోకో ఈ ఫోన్లను లాంచ్ చేసే అవకాశం ఉంది.


1. పోకో ఎక్స్4
చైనాలో గత నెలలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 ప్రోను రీబ్రాండ్ చేసి పోకో ఎక్స్4గా కంపెనీ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో 6.67 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ 920 ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా పోకో ఇందులో అందించే అవకాశం ఉంది.


2. పోకో ఎక్స్4 ప్రో
పోకో ఎక్స్4తో పాటు పోకో ఎక్స్4 ప్రో కూడా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే సరిగ్గా ఎప్పుడు లాంచ్ కానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను కంపెనీ అందించనుంది. అయితే కీలక స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం లేదు.


3. పోకో ఎక్స్4 ఎన్ఎఫ్‌సీ
పోకో ఎక్స్3 ఎన్ఎఫ్‌సీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అవుతుందో లేదో తెలియరాలేదు. ఎందుకంటే ఎన్ఎఫ్‌సీ వేరియంట్లు ఇప్పటివరకు మనదేశంలో లాంచ్ కాలేదు.


4. పోకో ఎక్స్4 జీటీ
పోకో ఎక్స్4 జీటీని కూడా కంపెనీ రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం జులైలో లాంచ్ అయిన పోకో ఎక్స్3 జీటీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని ఫీచర్ల గురించి ఎటువంటి వివరాలు తెలియరాలేదు.


5. పోకో ఎఫ్4 జీటీ
రెడ్‌మీ కే50 గేమింగ్ స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎఫ్4 జీటీ లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను ఇందులో కంపెనీ అందించనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని సమాచారం.


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి