సోనీ తన కొత్త బ్రేవియా ఎక్స్90కే టీవీ సిరీస్‌ను సోమవారం మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో 55 ఇంచులు, 65 ఇంచులు, 75 ఇంచుల మోడల్స్ ఉన్నాయి. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్‌ఆర్, 4కే అప్‌స్కేలింగ్ టెక్నాలజీలు కూడా వీటిలో అందించారు. సౌండ్‌కు డాల్బీ అట్మాస్, అకౌస్టిక్ మల్టీ ఆడియో, 3డీ సరౌండ్ అప్‌స్కేలింగ్ టెక్నాలజీలు కూడా ఉన్నాయి.
సోనీ బ్రేవియా ఎక్స్ఆర్90కే సిరీస్ ధర
ఇందులో 55 ఇంచుల వేరియంట్ ధర రూ.1,23,490గా ఉంది. 65 ఇంచుల వేరియంట్ ధర రూ.1,70,990గా నిర్ణయించారు. 75 ఇంచుల వేరియంట్ ధర తెలియరాలేదు. సోనీ సెంటర్లు, ప్రధాన రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు.
సోనీ బ్రేవియా ఎక్స్ఆర్90కే సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ టీవీల్లో 4కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లేలను అందించారు. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 100 హెర్ట్జ్‌గా ఉంది. కాగ్నిటివ్ ప్రాసెసర్ ఎక్స్, ఎక్స్ఆర్ 4కే అప్‌స్కేలింగ్, ఎక్స్ఆర్ మోషన్ క్లారిటీ టెక్నాలజీ కూడా ఈ టీవీల్లో ఉన్నాయి. ఇక గేమింగ్ కోసం హెచ్‌డీఎంఐ 2.1 కంపాబిలిటీ, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్), ఆటో లో లేటెన్సీ మోడ్ (ఏఎల్ఎల్ఎం) వంటి ఫీచర్లు కూడా అందించారు. ఆటోమేటిక్ యాంబియంట్ ఆప్టిమైజేషన్ కోసం లైట్ సెన్సార్లు కూడా ఈ టీవీల్లో అందించారు.
రెండు ఫుల్ రేంజ్ బేస్ రిఫ్లెక్స్ స్పీకర్లు వీటిలో ఉన్నాయి. దీంతోపాటు రెండు ట్వీటర్లు అందించారు. 40W ఆడియో అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది. డాల్బీ అట్మాస్, ఎక్స్ఆర్ సౌండ్ పొజిసన్, అకౌస్టిక్ మల్టీ ఆడియో, 3డీ సరౌండ్ అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలను డౌన్‌లోడ్ చేయవచ్చు. ఈ టీవీలు యాపిల్ హోం కిట్, ఎయిర్ ప్లేలను కూడా సపోర్ట్ చేయనున్నాయి. ఐప్యాడ్‌లు, ఐఫోన్లను దీని ద్వారా టీవీకు కనెక్ట్ చేయవచ్చు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!