ఎల్జీ తన రోలబుల్ టీవీని మనదేశంలో లాంచ్ చేసింది. దీంతోపాటు మరి కొన్ని ఓఎల్ఈడీ టీవీలు కూడా లాంచ్ అయ్యాయి. అయితే మెయిన్ అట్రాక్షన్ మాత్రం ఇదే. ఈ టీవీ ఆఫ్ చేస్తే ఒక చిన్న టేబుల్ లాగా కనిపిస్తుంది. ఆన్ చేసినప్పుడు మాత్రం స్క్రీన్ పైకి వస్తుంది. స్క్రీన్‌ను మొత్తం ఓపెన్ కాకూడదు అనుకుంటే మనకు ఎంత వరకు కావాలనుకుంటే అంత బయటకు తీసే ఆప్షన్ కూడా ఉంది.


ఎల్జీ రోలబుల్ టీవీ ధర
ఎల్జీ రోలబుల్ టీవీ ధరను మనదేశంలో రూ.75 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఈ టీవీ అందుబాటులో లేదు. ఎల్జీ అధికారిక వెబ్ సైట్లో దీన్ని లిస్ట్ చేశారు. అయితే స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేయాల్సిందిగా అందులో తెలిపారు. స్టోర్‌లో ఆర్డర్ పెడితే ఆ తర్వాత డెలివరీ చేస్తారేమో చూడాలి.


ఎల్జీ రోలబుల్ టీవీ స్పెసిఫికేషన్లు
ఈ హైఎండ్ ఎల్జీ రోలబుల్ ఓఎల్ఈడీలో 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. సెల్ఫ్ లైటింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. కాంపాక్ట్ లైన్ వ్యూ, ఫుల్ వ్యూ సపోర్ట్ ఇందులో అందించారు. టీవీని ఉపయోగించకపోతే పూర్తిగా జీరో మోడ్‌లోకి వెళ్లిపోతుంది. అప్పుడు డిస్‌ప్లే పూర్తిగా హైడ్ అయిపోతుంది.


ఆల్ఫా9 జెన్5 ఏఐ 4కే ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. సినిమా హెచ్‌డీఆర్, హెచ్‌డీఆర్ 10 ప్రో, హెచ్ఎల్‌జీ, ఏఐ 4కే అప్‌స్కేలింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈఆర్క్, ఎన్‌వీడియా జీ-సింక్, ఏఎండీ ఫ్రీసింక్, ఏఎల్ఎల్ఎం సపోర్ట్ కూడా ఉన్నాయి.


ఎల్జీ వెబ్ఓఎస్ స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. 100W స్పీకర్లను ఇందులో అందించారు. 40W సబ్ఊఫర్లు, 4.2 చానెల్ సెటప్, డాల్బీ అట్మాస్ సెటప్ కూడా ఈ టీవీలో అందించారు. వైఫై, బ్లూటూత్ 5.0 కూడా ఇందులో ఉన్నాయి. నాలుగు హెచ్‌డీఎంఐ 2.1 పోర్టులు, మూడు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, ఒక డిజిటల్ ఆడియో ఔట్, ఆర్ఎఫ్ ఇన్‌పుట్ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉన్నాయి. దీని బరువు 91 కేజీలుగా ఉంది.



Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!