టాటా బ్రాండ్  ( TATA ) క్రోమా పేరుతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అమ్ముతోంది. వారికి అదే పేరుతో సొంత బ్రాండ్ కూడా ( Chorma )ఉంది. టాటా అంటే నాణ్యత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారి పేరుకు తగ్గట్లుగానే  టీవీని ( Television ) లాంచ్ చేసింది. రూ. తొమ్మిదివేలకే  లభించే టీవీని లాంఛ్ చేసింది. క్రోమ్ స్టోర్లలో ( Chrome Stores ) ఇది లభిస్తుంది. 
 


క్రోమా ఎల్‌ఈడీ టీవీ స్పెసిఫికేషన్స్
 
బ్రాండ్ : Croma
ప్రొడక్ట్ నేమ్ : Croma 80cm (32 Inch) HD Ready TV (A Grade Panel, CREL7369, Black)
ధర : రూ. 8990
స్క్రీన్ సైజ్ : 32 ఇంచ్‌లు
స్క్రీన్ టైప్ :  అల్ట్రా బ్రైట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే  
 డిస్‌ప్లే ఫీచర్స్ :  


రెజల్యూషన్ : 1366 x 768    
యూఎస్‌బీ పోర్ట్స్ : 2
హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్స్ : 2
ఏడాది గ్యారంటీ కూడా ఇస్తారు. 


కోర్ i3, 11th జనరేషన్ ప్రాసెసర్‌ ఉన్న బెస్ట్ మోడల్ ల్యాప్‌టాప్ ఏదో తెలుసా ? డెల్‌ రిలీజ్ చేసిన ఈ మోడల్ మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది  


దిగువ మధ్యతరగతి కుటంబాలు.. ఎల్‌ఈడీ టీవీకి ( LED TV ) మారాలనుకునే ఈ టీవీ సూటబుల్‌గా ఉంటుంది. అలాగే ఇంట్లో రెండో టీవీ ఉండాలనుకునేవారికి ఇది బాగా సూటవుతుంది. టాటా బ్రాండ్ కాబట్టి..ఏడాది గ్యారెంటీ ఉంటుంది కాబట్టి నాణ్యతకూ ఢోకా ఉండదు. అయితే ఇటీవలి కాలంలో ఎక్కువ మంది స్మార్ట్ టీవీలను ప్రిఫర్ చేస్తున్నారు. ఈ టీవీకి ఆ ఫీచర్ లేకపోవడం మైనస్ అనుకోవచ్చు. క్రోమా స్టోర్లన్నింటిలోనూ ఈ టీవీ అమ్మకానికి ఉంది. 


బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? రెడ్‌మీ నోట్ 11 పై ఓ కన్నేయండి


సాధారణంగా టీవీ బ్రాండ్‌లు ఇప్పుడుపూర్తిగా రూపు మార్చుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లో గట్టి ప ట్టు సాధించిన కంపెనీలు ఇప్పుడు టీవీల విషయంలోనూ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే క్రోమా మాత్రం  ఎలాంటి స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. స్వతంత్ర ఉత్పత్తిదారులతో కలిసి సొంత బ్రాండ్ బిల్డ్ చేసుకుంది. క్రోమా ఉత్పత్తులను పూర్తిగా టెస్టింగ్ చేసిన తర్వాత  మార్కెట్లోకి పంపిస్తారు. టాటా బ్రాండ్‌కు సంబంధించిన విషయం కావడమే దీనికి కారణం. ధర తక్కువ అయినా అత్యుత్తమ క్వారిటీ క్రోమా సొంతం అని చెప్పుకోవచ్చు.