ల్యాప్ ట్యాప్ లేకపోతే ఇప్పుడు రోజువారీ వ్యవహారాలు చక్కబెట్టడం కూడా కష్టమయ్యేలా టెక్నాలజీ మనజీవితాల్లో కలసిపోతోంది. దానికి తగ్గట్లుగానే కంపెనీలు సరికొత్త ఆవిష్కరణలో ల్యాప్ ట్యాప్‌లు ఆవిష్కరిస్తున్నాయి.ఈ జనవరిలోలో డెల్ కంపెనీ తన ఇన్‌స్పిరాన్ సిరీస్‌లో కొత్త మోడల్ ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు Dell New Inspiron 15 5509. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


డెల్ వోస్ట్రో సిరీస్ లాగానే ఇన్‌స్పిరాన్ సిరీస్ కూడా జనాదరణ పొందింది. ఈ మోడల్‌ను ఏళ్ల తరబడి అప్ డేట్ చేస్తూనే ఉన్నారు.  ఇప్పుడు XPS సిరీస్‌కి దగ్గరగా వచ్చే కొన్ని మంచి నోట్‌బుక్‌లను అందిస్తుంది. Dell Inspiron 15 ల్యాప్‌టాప్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది -




బేసిక్ ఇన్ఫర్మేషన్ :


మోడల్   : న్యూ ఇన్‌స్పిరాన్ 15 5509
గ్లోబల్ లాంచ్ డేట్ : 13-01-2021
ఆపరేటింగ్ సిస్టమ్ : Windows 10 Home


డిస్‌ప్లే
రిజల్యూషన్  : 1920 x 1080
డిస్‌ప్లే సైజ్ ( ఇంచ్‌ల్లో  ) : 15.6
డిస్‌ప్లే టెక్నాలజీ : UHD


కనెక్టివిటి 


వైర్‌లెస్ కనెక్టివిటి : Yes


మెమరీ


ర్యామ్  : 8 జీబీ
ర్యామ్ టైప్   : DDR4
ర్యామ్ స్పీడ్  (In Mhz) : 3200


ఫిజికల్ స్పెసిఫికేషన్
ల్యాప్ ట్యాప్ బరువు : 1.714 కేజీలు
డైమన్షన్ (In Mm) : 14.15 x 356.1 x 234.5
ప్రాసెసర్
ప్రాసెసస్ మోడల్ నేమ్   : 11th Gen Intel® Core™ i3-1115G4
క్లాక్ స్పీడ్ : 4.1 GHz
గ్రాఫిక్స్ స్పీడ్ : Intel® UHD
క్యాచే L3 : 6MB


స్టోరేజ్
స్టోరేజ్ డ్రైవ్ టైప్ : SSD
స్టోరేజీ డ్రైవ్ కెపాసిటీ : 512 GB


పవర్ 
బ్యాటరీ టైప్ : Integrated
పవర్ స్ప్లై : 53WHr


సౌండ్ 
స్పీకర్స్ : Stereo speakers with Waves
సౌండ్ టెక్నాలజీ  : MaxxAudio® Pro ALC3204




డెల్ ఇన్‌స్పిరాన్ 15 స్పోర్ట్స్  స్లీక్ డిజైన్‌తో వచ్చింది. ప్రీమియం నోట్‌బుక్‌లకు మాత్రమే ఇప్పటి వరకూ ఇలాంటి డిజైన్ ఉంది. డైమండ్ కట్ ఎడ్జెస్ ఉంటాయి. లగ్జరీ టచ్ స్టైల్ ఉండటం ఈ ల్యాప్ ప్రత్యేకత .


ఇండియాలో డెల్ ఇన్‌స్పిరాన్ 15 రూ. 47 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రాసెసస్, వేరియంట్‌ను బట్టి రేటు మారుతుంది. డెల్ ఇన్‌స్పిరాన్ సిరీస్‌ను 2015లో లాంచ్ చేశారు.  మంచి ఆదరణ లభించడంతో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వస్తున్నారు.