వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 31వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ స్మార్ట్ టీవీ కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ ఈ విషయాలను టీజ్ చేశారు. ఇందులో 4కే డిస్‌ప్లేను అందించనున్నారు.


వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఇషాన్ అగర్వాల్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ వన్‌ప్లస్ టీవీ వై1ఎస్‌లో 4కే డిస్‌ప్లే ఉండనుంది. ఇందులో 24W స్పీకర్లు ఉండనున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌ను కూడా ఈ టీవీ అందించనుండటం విశేషం. 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.


ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్, అలెక్సాలను ఇది సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్, మిరాకాస్ట్, వన్‌ప్లస్ కనెక్ట్ 2.0ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.


వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది.  ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.


ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.