చైనాకు చెందిన బడ్జెట్ ఫోన్ల తయారీ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో 11మోడల్ విడుదల చేసింది. రెడ్‌మీ 10 ( Redmi Note 10) కి కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను ఈ మోడల్‌కు తీసుకు వచ్చింది. సూపర్ అమ్‌లెడ్ ప్యానల్, రిజల్యూషన్ మరింత మెరుగ్గా ఉంది. ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్స్ ఉండటం ప్రత్యేకత. రెడ్ మీ ఫోన్ల మోడల్స్ కొంత గందరగోళంగా ఉంటున్నాయి. చైనాలో రెడ్‌మీ 11, రెడ్‌మీ 11 ఫోర్ జీ వంటి మోడల్స్ ఉన్నాయి. అలాగే రెడ్ మీ నోట్ 11 ఎస్ అనే మోడల్ కూడా ఉంది. ఇది వేరే మోడల్. ఈ మోడల్‌లో మీడియాటెక్ చిప్ సెట్‌తో పాటు 108 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. అయితే ఇప్పుడు మన రివ్యూ చేసుకుంటోంది.. రెడ్‌మీ నోట్ 11. ఈ ఫోన్ స్పెక్స్ ఏంటో చూద్దాం.!
రెడ్‌మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ :
బాడీ : 159.9x73.9x8.1mm, 179g; ప్లాస్టిక్ బాడీ ; IP53, డస్ట్, స్ప్లాష్ నుంచి రక్షణ
డిస్‌ప్లే : 6.43" AMOLED, 90Hz, 700 nits, 1000 nits ( పీక్), 1080x2400px రిజల్యూషన్ , 20:9 యాస్పెక్ట్ రేషియో , 409 పీపీఐ
చిప్‌సెట్ : కాల్కం SM6225 స్నాప్ డ్రాగన్ 680 4G (6 nm): అక్టాకోర్ (4x2.4 GHz Kryo 265 Gold & 4x1.9 GHz Kryo 265 Silver); Adreno 610.
మెమరీ : 64GB 4GB RAM, 64GB 6GB RAM, 128GB 4GB RAM, 128GB 6GB RAM; UFS 2.2; microSDXC ( ప్రత్యేకమైన స్లాట్).
ఓఎస్ : అండ్రాయిడ్ 11, ఎంఐయూఐ 13.
రియర్ కెమెరా : వైడ్ మెయిన్ : 50 మెగాపిక్సెల్ f/1.8, 26mm, PDAF; అల్ట్రా వైడ్ యాంగిల్ : 8 MP, f/2.2, 118-degree; Macro: 2 MP, f/2.4; Depth: 2 MP, f/2.4.
ప్రంట్ కెమెరా : 13 మెగా పిక్సెల్ , f/2.4, (wide)
వీడియో క్యాప్చర్ : రియర్ కెమెరా : 1080p@30fps; ఫ్రంట్ కెమెరా : 1080p@30fps.
బ్యాటరీ : 5000mAh; ఫాస్ట్ చార్జింగ్ g 33W, 60 నిమిషాల్లో వంద శాతం చార్జింగ్ , Power Delivery 3.0, Quick Charge 3+.
ఫింగర్ ప్రింట్ రీడర్, ఇన్ ఫ్రా రెడ్ పోర్ట్, 3.5mm జాక్ ; వర్చువల్ పాక్సిమటీ సెన్సార్ వంటివి ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణ
రెడ్‌మీ నోట్ ధర బడ్ట్ ఫ్రెండ్లీగానే ఉంటోంది. ఆన్ లైన్ పోర్టర్స్‌లో రూ. 14వేల నుంచి లభ్యమవుతున్నాయి. 4, 6 జీబీ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదలచేశారు.
అయితే ఈ ఫోన్ మోడల్ 11 అయినప్పటికీ.. రెడ్‌మీ 10పోలిస్తే కొన్నింటిని అప్ గ్రేడ్ చేయలేదు. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు. ప్రీమియం లుకింగ్ ఫినిషింగ్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఫోన్ మెటీరియల్ నాణ్యత రెడ్‌మీ స్టాండర్డ్స్‌కు తగ్గట్లుగానే ఉంది. డ్యూయల్ స్టీరియోస్పీకర్ ఉండటం వల్ల మరింత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.