TRAI New Rule From 1 November 2024: దేశంలో సైబర్ మోసాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ దుండగులు రోజుకో కొత్త మార్గాన్ని అవలంబిస్తున్నారు. ఈ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కూడా యాక్షన్ మోడ్‌లో ఉంది. ఇటువంటివి జరగకుండా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తమ సిమ్ కార్డ్ వినియోగదారుల డేటాను సురక్షితంగా ఉంచడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశిస్తోంది.


ఇలా చేయాల్సిందే...
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు స్కామర్‌లను నివారించడం సులభం అవుతుంది. ఆయా కంపెనీల టెన్షన్ కూడా తగ్గుతుంది. సిమ్ కార్డులకు సంబంధించిన కొత్త నిబంధనలు నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.


ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి?
ఫేక్ కాల్స్, మెసేజ్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం నిబంధనలు మార్చింది. ట్రాయ్ తెలుపుతున్న దాని ప్రకారం ఫేక్ కాల్స్‌ను అరికట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఫేక్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా మోసగాళ్లు ప్రజలను మోసం చేసి వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే



కొత్త నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం?
కొత్త రూల్ ప్రకారం, ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లను టెలికాం ఆపరేటర్లు ముందుగానే చెక్ చేస్తారు. ఈ నంబర్లలోని కొన్ని కీలకపదాలను గుర్తించడం ద్వారా ఆ మెసేజెస్, కాల్స్ వెంటనే బ్లాక్ అవుతాయి. ఇది మాత్రమే కాకుండా సిమ్ కార్డ్ వినియోగదారులు ఫిర్యాదు చేసినా ఆ మెసేజ్‌లు, కాల్స్ వచ్చే నంబర్లు వెంటనే బ్లాక్ అయిపోతాయి. మోసాన్ని నిరోధించడంలో సహాయపడే ఈ మోడల్ త్వరలో సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?