Tecno Spark 8C: టెక్నో స్పార్క్ 8సీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 53 గంటల కాలింగ్ టైం, 137 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైంను దీంతోపాటు అందించనున్నారు. గతేడాది మనదేశంలో లాంచ్ అయిన టెక్నో స్పార్క్ 8కు తర్వాతి వెర్షన్‌గా లాంచ్ అయింది. కంపెనీ ఇందులో 6 జీబీ ర్యామ్ ఉంది అని అంటుంది కానీ... వీరు ఫిజికల్‌గా 3 జీబీ ర్యామ్‌ను మాత్రమే అందిస్తున్నారు. మరో 3 జీబీ ర్యామ్ వర్చువల్‌గా అందుబాటులో ఉండనుంది. అంటే మీ ఫోన్ స్టోరేజ్ నుంచి ఒక 3 జీబీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చన్న మాట.
టెక్నో స్పార్క్ 8సీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు. డైమండ్ గ్రే, ఐరిస్ పర్పుల్, మ్యాగ్నెట్ బ్లాక్, టర్కోయిస్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో ఫిబ్రవరి 24వ తేదీ నుంచి జరగనుంది.
టెక్నో స్పార్క్ 8సీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు మరో ఏఐ లెన్స్ కూడా ఉండనుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
4జీ ఎల్టీఈ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో అందించారు. ఇందులో ఐపీఎక్స్2 స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా అందించారు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!