సోషల్ మీడియాను ఓ సారి ఓపెన్ చేసి పక్కన పెట్టే వారికి కూడా ఇప్పు "కచ్చాబాదం" గురించి తెలిసే ఉంటుంది. అంతగా పాపులర్ అయిపోయింది. దీనిపై ఎన్నెన్ని మీమ్స్ వస్తున్నాయో చెప్పడం కష్టం. "కచ్చా బాదం" అనేది ఓ పాట. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే భువన్ పద్మాకర్ అనే ఓ వీధి వ్యాపారిని ఈ పాట స్టార్‌ను చేసేసింది.
పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు అమ్ముతుండేవాడు. పాతవి, పాడైన వస్తువుల్ని తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తుండేవాడు. పాత సామాన్లు, పాడైన మొబైల్‌ఫోన్లను తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తాననే అర్థం వచ్చేలా లిరిక్స్ రాసుకొని "కచ్చా బాదం" ట్యూన్ కట్టాడు. భువన్ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. అంతే సెలబ్రిటీ అయిపోయాడు. అతనితో ఓ వీడియో కంపెనీ ర్యాప్ సాంగ్ కూడా చిత్రీకరించింది.
ఈ కచ్చాబాదంపై ఎన్నెన్ని మీమ్స్ వస్తున్నాయో ఓ సారి చూడండి.
ఇక ఈ కచ్చాబాదం పాటలకు డాన్స్ చేస్తున్న వారి సంఖ్య తక్కవేం కాదు. సెలబ్రిటీలు కూడా ఈ జాబితాలో ఉన్నారు.