టెక్నో పోవా నియో స్మార్ట్ ఫోన్ మనదేశంలో జనవరి 20వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను కంపెనీ షేర్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే నైజీరియాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.
టెక్నో పోవా నియో ధర (అంచనా)
ఈ ఫోన్ నైజీరియాలో 75,100 నైరాల (మనదేశ కరెన్సీలో రూ.13,800) ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇండియన్ వేరియంట్ కూడా రూ.15 వేల ధరలోపే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. మనదేశంలో ఎన్ని వేరియంట్లలో లాంచ్ కానుందో తెలియరాలేదు.
టెక్నో పోవా నియో స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఇప్పటికే నైజీరియాలో లాంచ్ అయింది. నైజీరియా వేరియంట్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.8 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 84.8 శాతంగా ఉంది. హోల్ పంచ్ తరహా డిస్‌ప్లేను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. టెక్నో పోవా నియోలో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. వెనకవైపు క్వాడ్ ఫ్లాష్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ముందువైపు డ్యూయల్ ఫ్లాష్ కూడా ఇందులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. 24 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైం, 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైం, 40 గంటల వరకు కాలింగ్ టైంను ఈ స్మార్ట్ ఫోన్ అందించనుంది. 15 నిమిషాల చార్జింగ్‌తో మూడు గంటల వరకు గేమింగ్ చేయవచ్చని టెక్నో తెలిపింది. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!