తెలంగాణలో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతూండటంతో ప్రభుత్వం విద్యా సంస్థలకు ఇచ్చిన సెలవులు పొడిగించాలనుకుంటోందని ప్రచారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం సెలవులు పొడిగించడం కన్నా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు మొగ్గు చూపింది.గతంలో తెలంగాణ విద్యా శాఖ జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. ఆదివారంతో ముగుస్తున్నాయి. సెలవులు ప్రకటించిన తర్వాత కరోనా, ఒమైక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.
Also Read: హేమమాలిని ప్లేస్‌లోకి కంగనా ! రాజకీయ నేతలూ బ్రాండ్ అంబాసిడర్లను మార్చేస్తారా ?
కరోనా పరిస్థితులను బట్టి సెలవులు పొడగించాలా? వద్దా అన్న అంశంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు తర్జనభర్జన పడ్డాయి. సెలవులు పొడిగితే సిలబస్ పూర్తి కావడానికి సమస్య ఏర్పడుతుందని అంచనాకు వచ్చారు. దంతో ఆన్ లైన్ క్లాసులకే మొగ్గు చూపారు. సెలవులు ముగిసిన తరువాత రోజు నుంచి అంటే సోమవారం నుంచి విద్యార్థులంతా మళ్ళీ ఆన్‌లైన్ క్లాసులకు రెడీ అవ్వాల్సి ఉంది. గతంలో ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన అనుభవం ఉన్నందున ఈ సారి ప్రత్యేకంగా సన్నాహాలు అవసరం లేదని భావిస్తున్నారు.
Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !
ఇప్పటికే ప్రతి విద్యార్థి టీశాట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థులతో మాట్లాడి కావాల్సిన సహాయం చేయాలని టీచర్లు, స్కూల్ హెడ్ మాస్టర్లకు విద్యాశాఖ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లు కూడా ఇదే పద్దతి పాటించాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.
Also Read: నాలుగేళ్లు మంచం మీదే.. వ్యాక్సిన్ ఇవ్వగానే లేచి కూర్చున్నాడు ! టీకాలో ఎవరికీ తెలియని శక్తి ఉందా?
ఇప్పటికైతే నెలాఖరు వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితిని బట్టి నెలాఖలరులో మళ్లీ ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా లేక ఆన్ లైన్ క్లాసులు కొనసాగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యమని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!