భారత మార్కెట్‌లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్‌బ్యాండ్ రిలీజ్ అయింది. సౌండ్‌కోర్ నుంచి ఆర్500 (R500) నెక్‌బ్యాండ్ తరహా ఇయర్‌ఫోన్‌లు భారతదేశంలో విడుదలయ్యాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 20 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయి. ఈ నెక్‌బ్యాండ్‌కు 18 నెలల వారంటీ కూడా అందిస్తున్నారు. వీటికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంది. యూఎస్ బీ టైప్ సీ పోర్టు ద్వారా ఛార్జింగ్ అందించవచ్చు.


సౌండ్‌కోర్ ఆర్500 10ఎంఎం డ్రైవర్లతో రానున్నాయి. ఇది హెచ్‌డీ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. బ్లూటూత్ వీ5 ద్వారా వీటిని ఆండ్రాయిడ్, ఐఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. 10 మీటర్ల దూరం (రేంజ్) వరకు వీటిని కనెక్ట్ చేయవచ్చు. ఇందులో ఏఐ ఆధారిత మైక్రోఫోన్స్ ఉండటం వల్ల కాల్ క్వాలిటీ బాగుంటుందని కంపెనీ చెబుతోంది. ఈ నెక్‌బ్యాండ్ ఐపీఎక్స్5 వాటర్ ఫ్రూప్ ఫీచర్ ఉంది. 



Also Read: Nothing Ear 1 Launch: నథింగ్ నుంచి ఇయర్ ఫోన్స్.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు
సౌండ్‌కోర్ ఆర్500 ధర..
భారతదేశంలో సౌండ్‌కోర్ ఆర్500 నెక్‌బ్యాండ్ ధర రూ.1399గా నిర్ణయించారు. వీటిని ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, బ్లూ, రెడ్, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎల్లో కలర్ నెక్‌బ్యాండ్ అందుబాటులో లేదని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్టులపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చే అమెక్స్ నెట్ వర్క్ కార్డు, మొబిక్విక్, ఫ్లిప్ కార్డు పేలేటెర్ వంటి వాటి ద్వారా కొనుగోలు చేస్తే మంచి డీల్స్ ఉన్నాయి. 



195 ఎంఏహెచ్ బ్యాటరీ..
సౌండ్‌కోర్ ఆర్500 నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్లలో 195 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. వీటిని ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే దాదాపు 20 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. కేవలం 10 నిమిషాల చార్జింగ్ తో 3 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తుందని తెలిపింది. ఇక ఈ నెక్‌బ్యాండ్ ని పూర్తిగా చార్జ్ చేయడానికి 1.5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. దీని ఇన్‌లైన్ రిమోట్‌లో రెండు బటన్లు ఉన్నాయి.


Also Read: Motorola Edge 20: వన్‌ప్లస్ నార్డ్ 2కు గట్టి పోటీ ఇచ్చే మోటొరోలా ఎడ్జ్ 20 వచ్చేసింది.. ఆగస్టు 24 నుంచి సేల్ స్టార్ట్..


Also Read: WhatsApp Payments: వాట్సాప్‌ పేమెంట్స్‌ చేస్తున్నారా? అవతలి వారికి మీ ఫీలింగ్ ఎంటో థీమ్ తో చెప్పెయండిలా..