ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన కొత్త ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. మోటొరోలా ఎడ్జ్ 20, మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ పేరున్న రెండు ఫోన్లు ఈరోజు ఇండియాలో విడుదలయ్యాయి. మోటొరోలా ఎడ్జ్ 20 మిడ్ రేంజ్ ఫోన్‌గా గత నెలలోనే యూరప్‌లో విడుదలకాగా.. ఇప్పుడు ఇండియాలో ఎంట్రీ ఇచ్చింది. యూరప్ ధరతో పోలిస్తే ఇండియాలో చాలా తక్కువ రేటుకే లభిస్తుంది. భారతదేశంలో అత్యంత సన్నని, లైట్ వెయిట్ 5జీ ఫోనుగా ఇది రానుంది. మోటొరోలా ఎడ్జ్ 20.. వన్‌ప్లస్ నార్డ్ 2, వివో వి 21, శాంసంగ్ గెలాక్సీ ఎ 52 ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. 



రూ.29990 ధర..
మోటొరోలా ఎడ్జ్ 20 ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రానుంది. దీని ధర రూ.29990గా ఉంది. ఇది ఫ్రాస్ట్డ్ పెర్ల్, ఫ్రాస్ట్డ్ ఎమరాల్డ్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది. ఆగస్టు 24న మధ్యాహ్నం 12 గంటల నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌కు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ కార్డుల మీద ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంది. 
యూరప్‌లో దీని ధర 499.99 యూరోలుగా (సుమారు రూ.43700) ఉంది. ఈ ధరతో పోలిస్తే ఇండియాలో రూ.14000 వేల తగ్గింపు లభిస్తుంది. 


Also read: Jio Phone Next: రూ.4 వేలలోపు ధరలో జియో స్మార్ట్ ఫోన్.. సెప్టెంబర్‌లో రిలీజ్.. స్పెసిఫికేషన్లు లీక్


మోటొరోలా ఎడ్జ్ 20 ఫీచర్లు.. 



  • డ్యూయల్ సిమ్ (నానో) మోటరోలా ఎడ్జ్ 20.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత మైయూఎక్స్ (MyUX) తో పనిచేస్తుంది.

  • ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్)  ఓఎల్ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే అందించారు.

  • దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్, 576Hz టచ్ లేటెన్సీని ఇందులో అందించారు.

  • ఇందులో ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్‌ను అందించారు.

  • 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 16 మెగాపిక్సెల్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.






4000 ఎంఏహెచ్‌ కెపాసిటీ


మోటొరోలా ఎడ్జ్ 20..  బ్యాటరీ కెపాసిటీ 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉంటుంది. దీని బరువు 163 గ్రాములుగా ఉంది. కనెక్టివిటీ ఫీచర్లుగా.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఎన్ఎఫ్‌సీ ఉండనున్నాయి. యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ప్రొక్సిమిటీ సెన్సార్ వంటివి ఇందులో ఉన్నాయి.  


Also Read: Xiaomi India Event: 26న షియోమీ ఈవెంట్.. ఇండియాలో ఎంట్రీ ఇవ్వనున్న టీవీ, నోట్‌బుక్!