శాంసంగ్ గెలాక్సీ రింగ్ మనదేశంలో 2024లో లాంచ్ కానుందని తెలుస్తోంది. తన గెలాక్సీ స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ రింగ్‌తో శాంసంగ్ మెల్లగా రీప్లేస్ చేయనుందని సమాచారం. స్మార్ట్ వాచ్‌ల కంటే మరింత మెరుగ్గా ఈ రింగ్ పని చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్ డివైస్‌కు సంబంధించిన డిజైన్ రెండర్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రింగ్‌కు సంబంధించిన పేరును కూడా కంపెనీ ట్రేడ్ మార్క్ చేయించిందని సమాచారం. 2024 గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో గెలాక్సీ ఎస్24 సిరీస్ మొబైల్స్‌తో పాటు ఈ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయని  తెలుస్తోంది.


ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన వివరాలను వీబో అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేశారు. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ 2024 జనవరిలో జరగనుంది. అదే ఈవెంట్లో శాంసంగ్ స్మార్ట్ రింగ్ కూడా రానుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న గెలాక్సీ స్మార్ట్ వాచ్‌లను ఈ రింగ్స్ రీప్లేస్ చేసే అవకాశం ఉంది.


శాంసంగ్ తన రింగ్ నేమ్‌ను ఇంకా వెల్లడించలేదు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం గెలాక్సీ వన్, గెలాక్సీ పల్స్, గెలాక్సీ రిథమ్, గెలాక్సీ ఇండెక్స్, గెలాక్సీ ఇన్‌సైట్, గెలాక్సీ సర్కిల్ అనే పేర్లలో ఏదో ఒక్క పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.


గతంలో బయటకు వచ్చిన యునైటెడ్ స్టేట్స్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీస్ ఫైలింగ్ ప్రకారం... ఈ గెలాక్సీ రింగ్ హెల్త్, ఫిట్‌నెస్, స్లీప్ రిలేటెడ్ డేటాను ట్రాక్ చేయనుంది. హెల్త్ రికార్డ్స్‌ను ఇది మెయింటెయిన్ చేస్తుందని సమాచారం.  ఇందులో ఎన్నో సెన్సార్లను అందించనున్నారు. గతంలో వచ్చిన లీక్ ప్రకారం ఈ స్మార్ట్ రింగ్ మెటాలిక్ ఫినిష్‌తో రానుంది. 


ఇటీవలే బోట్ కూడా తన మొదటి స్మార్ట్ రింగ్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. ఇందులో సింగులర్ మెటాలిక్ సిల్వర్ కలర్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. మనదేశంలో దీని ధరను రూ.8,999గా నిర్ణయించారు.


మరోవైపు శాంసంగ్ ప్రస్తుతం అప్‌గ్రేడెడ్ స్పెసిఫికేషన్లతో కొత్త కెమెరా సెన్సార్లపై పని చేస్తుందని తెలుస్తోంది. 2023 ప్రారంభంలో శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్‌లో ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా కంపెనీ అందించింది. అలాగే 10x ఆప్టికల్ జూమ్ కోసం మరో 10 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.


Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial