Samsung Galaxy Tab S8: ఒకవేళ మీకు మంచి ట్యాబ్ కొనాలనుకుంటే ఆఫర్ సేల్స్‌నే దీనికి సరైన సమయం. వాస్తవానికి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ఇటీవలే లాంచ్ అయింది. ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 టాబ్లెట్ ధరను తగ్గించింది.


శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 6 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ ఉన్న రెండు కెమెరాల సెటప్ వెనకవైపు ఉంది. వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. ఇందులో 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8పై తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8కు సంబంధించిన 128 జీబీ వైఫై వేరియంట్‌ను రూ.66,999కి శాంసంగ్ విడుదల చేసింది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ని ఇప్పుడు రూ. 48,999కి కొనుగోలు చేయవచ్చు. గ్రాఫైట్, సిల్వర్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో ఈ టాబ్లెట్ వస్తుంది. దీనితో పాటు శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8ని కొనుగోలు చేసే వారికి శాంసంగ్ కొన్ని ఆఫర్లను కూడా ఇస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై వినియోగదారులు రూ. 6,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ టాబ్లెట్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇది నెలకు రూ. 4,226 నుంచి ప్రారంభం అవుతుంది.


శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8లో 2560×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఉన్న 11 అంగుళాల WQXGA డిస్‌ప్లేను అందించారు. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ద్వారా పని చేయనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... 6 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8లో 8000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.


ఇటీవలే శాంసంగ్ భారతదేశంలో కొత్త శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో మూడు టాబ్లెట్‌లు ఉన్నాయి. అవే శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా. ఈ సిరీస్ ధర రూ. 85,999 నుంచి ప్రారంభం అవుతుంది. మన దేశంలో వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి.


మరోవైపు వన్‌ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ట్యాబ్లెట్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్‌సెట్‌పై పని చేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.


Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?


Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!


Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial