Best Automatic Cars In India: సాధారణంగా మార్కెట్లో మాన్యువల్ కారు కంటే ఆటోమేటిక్ కారు ఖరీదైనది అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ ఊహ సరైనది కాదు. ఎందుకంటే మార్కెట్లో చవకైన ధరలలో అనేక గొప్ప కార్లు ఉన్నాయి. ఇవి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. ట్రాఫిక్‌లో వాటిని నడపడం సులభం. అయితే వీటి నిర్వహణ మాత్రం కాస్త ఖరీదైనది. మీరు మంచి ఆటోమేటిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, తక్కువ ధరలో ఉన్న కార్లేవో ఒకసారి చూద్దాం.


మారుతి సుజుకి ఆల్టో కే10 ఏఎంటీ (Maruti Suzuki Alto K10 AMT)
మారుతి సుజుకి ఆల్టో కే10 ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ. 5.61 లక్షల నుంచి రూ. 5.90 లక్షల మధ్యలో ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. అంతేకాకుండా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా ఇందులో అందుబాటులో ఉంది.


మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో AMT (Maruti Suzuki S-Presso AMT)
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఇది సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ఆటోమేటిక్ వేరియంట్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 6.05 లక్షల మధ్య ఉంది.


మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఏఎంటీ (Maruti Suzuki Wagon R AMT)
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్లన్లు ఉన్నాయి. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌ ఆటోమేటిక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.54 లక్షల నుంచి రూ. 7.42 లక్షల మధ్య ఉంటుంది.


టాటా పంచ్ ఏఎంటీ (Tata Punch AMT)
మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇది. టాటా పంచ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది సీఎన్‌జీ ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. దీని ఆటోమేటిక్ వేరియంట్‌ల ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.50 లక్షల నుంచి రూ. 10.10 లక్షల మధ్య ఉంటుంది.


టాటా టియాగో ఏఎంటీ (Tata Tiago AMT)
టాటా మోటార్స్ ప్రస్తుత లైనప్‌లో ఇదే అత్యంత చవకైన కారు. టాటా టియాగో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ వేరియంట్‌ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.95 లక్షల నుంచి రూ.7.80 లక్షల మధ్య ఉంది.


మరోవైపు 2023 సెప్టెంబర్‌లో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ దాదాపు 3.62 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో మంచి మెరుగుదలను నమోదు చేసింది. 2022 సెప్టెంబర్‌తో పోలిస్తే రెండు శాతానికి పైగా వృద్ధిని, గత నెల ఆగస్టుతో పోలిస్తే 0.7 శాతం వృద్ధిని చూసింది. పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial