శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. లీకైన వివరాల ప్రకారం.. దీని ధర 699 డాలర్లుగా(సుమారు రూ.53,000) ఉండనుంది. గ్రాఫైట్, వైట్, ఆలివ్ గ్రీన్, లావెండర్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 888 లేదా ఎక్సినోస్ 2100 ప్రాసెసర్ అందించే అవకాశం ఉంది. 6 జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు.. 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. అయితే ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ అందుబాటులో లేదు.


ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉండనున్నాయి.


ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 15 వరకు అప్‌డేట్స్‌ను అందించనున్నారు. ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ కాగా, దీంతోపాటు 25W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి