Redmi 10A: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) కొత్త రెడ్‌మీ (Redmi) ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.రెడ్‌మీ 10ఏ స్మార్ట్ ఫోన్ ఇటీవలే టెనా సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. మనదేశంలో గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9ఏకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.
220233L2C మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ టెనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కనిపించింది. దీంతోపాటు చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కూడా ఈ ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రూ.10 వేలలోపే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రెడ్‌మీ 10ఏ స్పెసిఫికేషన్లు (Redmi 10A Specifications)
టెనా లిస్టింగ్ ప్రకారం... ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 2.0 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ అని వార్తలు వస్తున్నాయి. 2 జీబీ నుంచి 8 జీబీ వరకు వేర్వేరు ర్యామ్‌తో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది.
దీంతోపాటు 32 జీబీ నుంచి 128 జీబీ వరకు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం ఇందులో ఉండనుందని తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4900 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో లేదో తెలియరాలేదు. టెనా లిస్టింగ్ ప్రకారం... పింక్, గ్రే, బ్లూ, ఆరెంజ్, సిల్వర్, రెడ్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, వైట్, వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా... బరువు 194 గ్రాములుగా ఉండనుంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!