రష్యాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకున్న భారత విదేశాంగ శాఖ బృందాలు అక్కడికి చేరుకున్న మన పౌరులను స్వదేశానికి తరలిస్తున్నారు. అయితే బాంబుల మోత మధ్య సరిహద్దు చేరుకోవడం భారతీయులకు ఇబ్బందిగా మారిన వేళ మత త్రివర్ణ పతాకం వారికి రక్షణ కవచంగా నిలిచింది.






జెండాకు సెల్యూట్


ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం తుపాకీ తూటాలు, బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. అక్కడ చిక్కుకున్న మన భారత పౌరులు.. మన త్రివర్ణ పతాకం చేతబట్టుకొని సరిహద్దులకు తరలివస్తున్నారు. భారత జెండా నీడన వస్తోన్న మన పౌరులను చూసి రష్యా సేనలు కూడా దారి వదులుతున్నాయి. మన పౌరులను సురక్షితంగా సరిహద్దులు చేరేలా చూస్తున్నారు రష్యా సైనికులు. మన పౌరులు వచ్చే బస్సులు, ఇతర వాహనాలపై భారత జెండాను పెట్టుకున్నారు.


రష్యా సేనల సలాం


భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల లేఖను కూడా బస్సుపై ఉంచారు. మన త్రివర్ణ పతాకం చూసిన రష్యా ఆర్మీ.. గౌరవంగా భారతీయులను సరిహద్దులు చేరేలా చూస్తున్నారు. ఎక్కడా ఈ వాహనాలను రష్యా సైన్యం ఆపడం లేదు.


12 గంటల ప్రయాణం


ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరం నుంచి రొమానియా సరిహద్దు చేరేందుకు మన పౌరులు దాదాపు 12 గంటలపాటు బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఒక్కో బస్సులో 50 మంది విద్యార్థులను తరలించారు. రొమానియా సరిహద్దుకు చేరుకున్న తర్వాత అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా చేరుకుని సాయం చేసినట్లు విద్యార్థులు తెలిపారు. రొమానియా నుంచి భారత్ చేరేందుకు ఎయిర్ ఇండియా విమానాన్ని ఏర్పాటు చేశారు.


రొమానియాలో రెండు రోజుల పాటు ఉండేందుకు భారత ఎంబసీ ఏర్పాటు చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఒకవేళ అత్యవసరంగా ఎవరైనా స్వదేశానికి వెళ్లాలంటే వారిని తక్షణమే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.


Also Read: Russia Ukraine War: రెండు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా- కీవ్‌లో ఉక్రెయిన్ ప్రతిఘటన


Also Read: Russia Ukraine War: చర్చలకు రష్యా ఓకే- సమావేశం కాదు ఇక సమరమే అంటోన్న ఉక్రెయిన్