రియల్‌మీ బుక్ ఎన్‌హేన్స్‌డ్ ఎయిర్ చైనాలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ ల్యాప్‌టాప్ ఇదే. దీని బరువు 1.37 కేజీలుగా ఉంది. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌లో 2కే డిస్‌ప్లే కూడా ఉంది.
రియల్‌మీ బుక్ ఎన్‌హేన్స్‌డ్ ఎయిర్ ధర
ఈ ల్యాప్‌టాప్ ధరను 4,699 యువాన్లుగా (సుమారు రూ. 55,100) నిర్ణయించారు. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఐల్యాండ్ గ్రే, స్కై బ్లూ రంగుల్లో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. ఇవి మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నావో తెలియరాలేదు.
రియల్‌మీ బుక్ ఎన్‌హేన్స్‌డ్ ఎయిర్ స్పెసిఫికేషన్లు
ఇందులో 14 అంగుళాల 2కే ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 3:2గా ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. 11వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 16 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌ను ఇందులో అందించారు. 512 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
ఈ ల్యాప్‌టాప్‌లో హర్మాన్ కర్డాన్ స్పీకర్లు అందించారు. డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. బ్యాక్ లిట్ కీబోర్డు, పెద్ద టచ్‌ప్యాడ్ కూడా ఇందులో ఉన్నాయి. పవర్ బటన్‌కు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అటాచ్ చేశారు. థండర్ బోల్డ్ 4, యూఎస్‌బీ టైప్-సీ 3.2 జెన్ 2, యూఎస్‌బీ టైప్-ఏ 3.1 జెన్ 1, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌లను కూడా ఇందులో అందించారు. వైఫై 6, బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.
ఒక్కసారి చార్జ్ చేస్తే 12 గంటల బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ తెలిపింది. దీని మందం 1.49 సెంటీమీటర్లు కాగా, బరువు 1.37 కేజీలుగా ఉంది.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!