Poco F6 Deadpool Limited Edition India Launch: పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ కానుంది. పోకో ఎఫ్6 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మే నెలలో లాంచ్ అయింది. స్పెషల్ డెడ్‌పూల్ వేరియంట్ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్‌తో రానుంది. మార్వల్ సినిమాటిక్ యూనివర్స్‌లో లేటెస్ట్ మూవీ ‘డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్’ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించిన లీక్డ్ ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ డిజైన్ ఎలా ఉండనుందో ఇందులో చూడవచ్చు.
పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఇండియా లాంచ్ ఎప్పుడు?
పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ (Poco F6 Deadpool Limited Edition) మనదేశంలో జులై 26వ తేదీన లాంచ్ కానుంది. అదే రోజున డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. దీని గురించి మిగతా వివరాలేవీ తెలియరాలేదు. దీని డిజైన్ చూడటానికి డెడ్‌పూల్ థీమ్‌తో ఉంది.
పోకో ఎఫ్6 లిమిటెడ్ ఎడిషన్ డిజైన్
దీనికి సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ఎక్స్‌లో వీటిని పోస్ట్ చేశారు. ఫోన్ వెనక ప్యానెల్‌ను ఇందులో చూడవచ్చు. డెడ్‌పూల్ సూట్ తరహాలో క్రిమ్సన్ షేడ్‌లో దీని బ్యాక్ ప్యానెల్ ఉండనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌పై డెడ్‌పూల్ లోగోను కూడా లీకైన ఫొటోలో చూడవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
కెమెరా యూనిట్ పక్కన పోకో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ అనేది ప్రింట్ అయి ఉంది. ప్యానెల్‌పై పాక్షికంగా డెడ్‌పూల్ ఫొటో కూడా కనిపిస్తుంది. పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్‌లో ఏ స్పెసిఫికేషన్లు అయితే ఉన్నాయో... అవే ఫీచర్లు ఇందులో కూడా ఉండే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.
పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల 120 హెర్ట్జ్ 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ముందువైపు 20 మెగాపిక్సెల్ సెన్సార్ అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. పోకో ఎఫ్6 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. స్టోరేజ్ కూడా 512 జీబీ వరకు ఉండటం విశేషం.
Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?