పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ నవంబర్ 9వ తేదీన లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ లాంచ్‌కు ముంగిట పోకో అదే రోజు లాంచ్ అయ్యే మరో ఫోన్‌ను కూడా రివీల్ చేసింది. అదే పోకో ఎఫ్3 స్మార్ట్ ఫోన్. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ సంవత్సరం మార్చిలో కంపెనీ ఒక పోకో ఎఫ్3 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు లాంచ్ అయ్యే వేరియంట్‌లో మెరుగైన స్పెసిఫికేషన్లు, కెమెరా ఫీచర్లు, ప్రాసెసర్, బ్యాటరీ ఉండనున్నాయి.


పోకో ఎఫ్3, పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు నవంబర్ 9వ తేదీన లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం.. నవంబర్ 9వ తేదీన సాయంత్రం 5:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. పోకో ఎఫ్3 లాంచ్‌ను కేవలం ఒక్కరోజు ముందే కంపెనీ లాంచ్ చేయడం విశేషం.


అయితే ఈ ఫోన్ ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పటివరకు ఏమీ తెలపలేదు. రెడ్‌మీ కే40 ప్రోకు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. పోకో ఎఫ్2 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా పోకో ఎఫ్3 ప్రో పేరుతో కూడా ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


పోకో ఎక్స్3 ప్రోతో పాటు పోకో ఎఫ్3 ఈ సంవత్సరం మార్చిలో లాంచ్ అయింది. రెడ్‌మీ కే40 స్మార్ట్‌ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న పోకో ఎఫ్3 స్పెసిఫికేషన్లు.. గతంలో లాంచ్ అయిన పోకో ఎఫ్3 కంటే అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో రానుంది.


స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే.. పోకో ఎఫ్3 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.


పోకో ఎఫ్3లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


Also Read: రూ.18 వేలలోపే 5జీ ఫోన్.. భారీ డిస్‌ప్లే కూడా!


Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!


Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!


Also Read: అత్యంత చవకైన శాంసంగ్ 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ధర ఎంత ఉండనుందంటే?


Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి