పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదే కాబోలు. ఓ వ్యాపారి బుర్రకు తట్టిన ఐడియా.. ఆహార ప్రియులకు కొత్త రకం రుచిని పరిచయం చేసింది. అదే.. ఈ ఒరియో (Oreo) బిస్కట్ బజ్జీ. ఔనండి.. నిజం! ఆ వ్యాపారి ఒరియో బిస్కట్లతో బజ్జీలు వేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ‘అరె ఏంట్రా ఇదీ’.. మరీ బిస్కట్లతో బజ్జీలు ఏంట్రా అని అనుకుంటున్నారా? కానీ, అక్కడి కస్టమర్లు మాత్రం అవంటే చాలా ఇష్టమట. అయితే, ఇదేదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చేస్తున్న గిమ్మిక్కులు అని కూడా అనుకోలేం. ఎందుకంటే.. అతడు సోషల్ మీడియా పుట్టుక ముందు నుంచే ఈ బజ్జీలు వేస్తూ ఫేమస్ అయ్యాడట. ఇంతకీ ఆ మహానుభావుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే.. పదండి గుజరాత్. 


మనం ఇప్పటి వరకు అరటి కాయ బజ్జీ, మిర్చి బజ్జీ, టమోటా బజ్జీ, ఎగ్ బజ్జీ గురించి మాత్రమే విన్నాం, రుచి చూశాం కూడా. చివరికి తమల పాకు బజ్జీలను కూడా మనలో కొందరు తినేసి ఉంటారు. అయితే, అహ్మదాబాద్‌లోని ఓ ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌లో వేసే ఈ ఒరియో బజ్జీ గురించి మాత్రం విని ఉండరు. ఇటీవల అమర్ సిరోహీ అనే ఫుడ్డీ తన యూట్యూబ్ చానెల్‌లో ఈ ఒరియో బజ్జీల వీడియోను పోస్ట్ చేసి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  


Also Read: మూవీ థియేటర్ గోడలో నగ్నంగా వ్యక్తి.. కొన్ని రోజులుగా అందులోనే.. ఎలా దూరావయ్య?


ఈ ఫేమస్ Oreo Pakoda గురించి సిరోహీ చెబుతూ.. ‘‘శనగ పిండిలో కాస్త నీరు, ఉప్పు బేకింగ్ పౌడర్ వేసి కలిపాడు. ఆ తర్వాత ఒరియో బిస్కట్ల ప్యాకెట్ విప్పాడు. బిస్కట్లను శనగ పిండిలో ముంచి.. వేడి వేడిగా మరుగుతున్న నూనెలో వేశాడు. దోరగా వేయించి.. కస్టమర్లకు అందిస్తున్నాడు. కస్టమర్లు కూడా దాన్ని ఇష్టంగా తినేస్తున్నారు. పిల్లలకు ఇది బాగా నచ్చుతుందట’’ అని తెలిపాడు. 100 గ్రామాలు ఒరియో బజ్జీలను రూ.30 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆ వ్యాపారి తెలిపాడు. దీన్ని టేస్ట్ చూసిన.. సిరోహీకి ఈ బజ్జీలు పెద్దగా నచ్చలేదు. ‘‘వీటిని తినొచ్చు. తినేందుకు బాగోలేదని చెప్పలేను. అలాగని బాగున్నాయని తినండి అని కూడా చెప్పలేను. ఇన్ని కూరగాయలు ఉండగా బిస్కెట్లతోనే బజ్జీ ఎందుకు వేశాడో అర్థం కావడం లేదు’’ అని తెలిపాడు. ఈ ఒరియో బజ్జీలను మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కానీ, పూర్తి రిస్క్ మీదే. 


ఒరియో బజ్జీల వీడియోను ఇక్కడ చూడండి: 



Also Read: చల్లటి నీరు లేదా కూల్ డ్రింక్‌, కాఫీలతో మాత్రలు వేసుకోవచ్చా?


Also Read: పెళ్లిలో వధువుకు మగాళ్లు ముద్దులు.. ఆ 3 రోజులు కొత్త జంటకు బాత్రూమ్ బంద్!


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి