భారత ప్రభుత్వం సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నకిలీ వార్తలను అరికట్టడానికి పని చేసే ఫ్యాక్ట్-చెక్ బృందం కూడా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి, PIB వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు మోసపూరిత వెబ్‌సైట్‌ల జాబితాను షేర్ చేస్తుంది.
ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో తొమ్మిది వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వాటి పేర్లు నిజమైనవి కానీ లింక్‌లు మాత్రం మోసపూరిత సైట్‌లకు దారితీస్తాయని PIB ఫాక్ట్-చెక్ విభాగం తెలిపింది. ఈ వెబ్‌సైట్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అనుమానాస్పదంగా కనిపించే ఫొటోలు, వీడియోలు లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు ఏజెన్సీని అప్రమత్తం చేయాలని కూడా సూచించారు.
PIB తెలిపిన మోసపూరిత వెబ్‌సైట్‌ల పూర్తి జాబితా ఇదే:
1) http://centralexcisegov.in/aboutus.php
2) https://register-for-your-free-scholarship.blogspot.com/
3) https://kusmyojna.in/landing/
4) https://www.kvms.org.in/
5) https://www.sajks.com/about-us.php
6) https://register-form-free-tablet.blogspot.com
7) https://nragov.online/
8) http://betibachaobetipadhao.in/
9) http://www.pibfactcheck.in/
PIB ఫ్యాక్ట్ చెక్ వింగ్ జాబితా చేసిన ఈ మోసపూరిత వెబ్‌సైట్‌ల పేర్లు నిజమైనవిలానే కనిపిస్తాయి. కానీ నిజానికి అవి నకిలీవి. ఉదాహరణకు లిస్ట్‌లో ఎనిమిదో వెబ్ సైట్ అయిన ‘http://betibachaobetipadhao.in/’ వెబ్ సైట్ పేరును గమనిస్తే... ఇది "http" వెబ్‌సైట్. ‘https’ కాదు. ఈ వెబ్‌సైట్లో అందించిన డేటా సురక్షితం కాదని కూడా గమనించాలి. ఈ-కామర్స్ చెల్లింపు సైట్‌లు లేదా ఆన్‌లైన్ కార్డ్ చెల్లింపులను అంగీకరించేవి లేదా వినియోగదారులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి వచ్చినప్పుడు భద్రత చాలా ముఖ్యం.
పీఐబీ ఫ్యాక్ట్-చెక్ విభాగం కాకుండా ప్రధాన టెలికాం కంపెనీలు, ఉద్యోగుల భవిష్య నిధి, ఆదాయపు పన్ను శాఖ వంటి ప్రభుత్వ సంస్థలు, ప్రధాన బ్యాంకులు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, పిన్‌లు లేదా OTP వివరాల వంటి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలను క్రమం తప్పకుండా అలెర్ట్ చేస్తూనే ఉంటాయి.
ఇంటర్నెట్ వినియోగదారులు వెబ్‌సైట్‌లను సందర్శించేటప్పుడు, నెట్‌ని బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి:
1. వినియోగదారులు https:// వంటి సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగించాలని సూచించారు.
2. అనుమానాస్పద లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించండి
3. సందేహాస్పద ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోండి
4. అధికారిక వెబ్‌సైట్‌లను మాత్రమే సందర్శించండ. బ్రౌజ్ చేయండి.
5. వినియోగదారులు తమ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు, ఫైర్‌వాల్‌లను అప్‌డేట్‌గా ఉంచుకోవాలని సూచించారు.